ఆ బాధ్యత మోయడం చాలా కష్టంగా ఉంది: విజయ్‌ | Vijay Devarakonda Talks Pushpaka Vimanam Pre Release Event In Visakhapatnam | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ‘మా పెరెంట్స్‌ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతూ..’

Published Mon, Nov 8 2021 9:29 PM | Last Updated on Mon, Nov 8 2021 9:46 PM

Vijay Devarakonda Talks Pushpaka Vimanam Pre Release Event In Visakhapatnam - Sakshi

ఒక వైపున హీరోగా తనని తాను నిరూపించుకుంటూ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా కూడా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్‌ నిర్మాణంలో తన సోదరుడు ఆకాశ్‌ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నవంబర్‌ 12న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. 

చదవండి: విడాకులపై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్‌ డిలిట్‌

‘హీరోగా నేను ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నిర్మాతలు దొరక్క చాలా కష్టాలు పడ్డాను. నా తరువాత వచ్చేవాళ్లు ఆ కష్టాలు పడకూడదనే ఒక బలమైన ఉద్దేశంతో నేను సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టాను. ఈ బాధ్యతను మోయడం చాలా కష్టంగా ఉంది .. అయినా అవకాశం పొందినవాళ్లు స్టేజ్‌పై మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కష్టమైనా కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే అనుకుంటున్నాను. మా పేరెంట్స్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతూనే నాకు పెట్రోల్ డబ్బులు ఇచ్చి ఆడిషన్స్‌కి పంపించారు.

చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్‌ క్రేజ్‌.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు

సినిమాల్లోకి రాకముందు నేను ఎవరనేది మా గల్లీలో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి నేను ఇప్పుడు ఒక నటుడిగా.. నిర్మాతగా వైజాగ్‌లో స్టేజ్‌పై నిలబడి ఉన్నా. నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ .. మీ మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్‌’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విజయ్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వలో లైగర్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement