నా మావయ్య.. భౌతికంగా లేరంతే: సునీత | KS Chitra And Shreya Ghoshal Singers Tribute SP Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

గాన గంధర్వుడికి గాయనీమణుల నివాళులు

Published Fri, Sep 25 2020 3:46 PM | Last Updated on Fri, Sep 25 2020 8:05 PM

KS Chitra And Shreya Ghoshal Singers Tribute SP Balasubrahmanyam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఒక శకం ముగిసింది. సంగీతం, ప్రపంచం ఇకపై మునుపటిలా ఉండబోవు. ఒక మంచి గాయనిగా పేరొందేలా నాకు మార్గనిర్దేశనం చేసిన ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆయన సమక్షంలో ఇకపై సంగీత ప్రదర్శనలు ఉండబోవు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. సావిత్రమ్మ, చరణ్‌, పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళులు అర్పించారు. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని ఉద్వేగానికి లోనయ్యారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత)

కోలుకుంటారని ఆశించాను: శ్రేయా ఘోషల్‌
లెజండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారులేరనే ఈ విషాదకర వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కోలుకుంటారని ఎంతగానో ఎదురుచూశాం. గొప్ప కళాకారులు. మంచి మనిషి. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన ఆశీస్సులు నాకు లభించాయి. ఆయనతో కలిసి పాటలు పాడటం నాకు దక్కిన అదృష్టం. సంగీతం ఉన్నంతకాలం మీ వారసత్వం కొనసాగుతుంది.  ఎస్పీబీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.
- శ్రేయా ఘోషల్‌ 

మీ ఆత్మకు శాంతి చేకూరాలి: కౌసల్య
ఎస్పీ బాలుగారి మరణం భారత సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఆరాధనాభావం మనకు వీనులవిందైన పాటలు ఎన్నింటినో అందించింది. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో మధుర గీతాలు ఆలపించిన ఆయన ఎ‍ప్పటికీ గుర్తుండిపోతారు.
- కౌసల్య

నా మావయ్య భౌతికంగా లేరు అంతే: సునీత
నా ఛిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి. నా ఆత్మబంధువు. నా మావయ్య భౌతికంగా లేరు అంతే.
- సింగర్‌ సునీత

Rest in peace #SPB garu. Very sad to hear this devastating news of the greatest, the legendary #SPBalasubrahmanyam passing away. We were so hopeful that he was on the path to recovery. pic.twitter.com/SnpXYWOXmh

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement