
యస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా
ఇళయరాజా– యస్పీ బాలసుబ్రహ్మణ్యంలది ఎవర్‌గ్రీన్ కాంబినేషన్. రాజా కంపోజిషన్‌లో బాలు అద్భుతమైన పాటలెన్నో పాడారు. సంగీతప్రియుల మ్యూజిక్ కలెక్షన్‌లో ఎవర్‌గ్రీన్ ఆల్బమ్స్‌లో నిలిచిపోయారు. అయితే ఈ మధ్య రాయల్టీ విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నేను స్వరపరిచిన పాటలెక్కడ పాడినా నాకు రాయల్టీ చెల్లించాలంటూ’ రాజా కొన్నేళ్లుగా సంచలన స్టేట్‌మెంట్స్ జారీ చేస్తూ వచ్చారు. దానికి ‘రాజా పాట పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరని’ యస్పీబీ కూడా చెప్పారు. అది వీరి మధ్య చిన్న గ్యాప్‌కు కారణం అయింది.
ఇటీవలే ఇళయరాజా, యస్పీబీ మళ్లీ కలసిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న ‘తమిళరసన్’ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు. ఇందులో ఓ పాటను యస్పీబీ ఆలపించారు. ఇటీవలే ఆ పాటను రికార్డ్ చేయించారు. ఇవాళ చెన్నైలో జరగబోయే ఇళయరాజా కన్సెర్ట్‌లో యస్పీబీ పాడనున్నారని తెలిసింది. ట్యూన్‌కి, టోన్‌కి మళ్లీ నేస్తం కుదిరింది. సో.. మళ్లీ మరెన్నో మ్యూజికల్ హిట్స్ సంగీతాభిమానులకు ఇవ్వడానికి ఈ కాంబినేషన్ నిశ్చయించుకుందని అనుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment