సాక్షి, హైదరాబాద్ : తానొక గడ్డిమొలక లాంటివాడినని, ఇళయరాజా పాట లేకుండా తాను ఉండలేనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తన పాటల విషయంలో రాయల్టీ కట్టాలంటూ అప్పట్లో ఇళయరాజా పేర్కొన్న సంగతి తెలిసిందే. తన అనుమతి లేనిదే తాను స్వరపర్చిన పాటలను పాడకూడదని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దూరంగా ఉన్న ఈ మిత్రద్వయం కొన్ని రోజుల క్రితమే మళ్లీ కలిసిపోయారు.
నవంబర్ 30న చిత్ర, ఏసుదాసులతో కలిసి నిర్వహించబోయే సంగీత విభావరి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీబీ మాట్లాడుతూ.. ఇళయరాజాతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఎస్పీబీ తెలిపారు. రాయల్టీ విషయంలో ఏవో చిన్న బేధాభిప్రాయాలు వచ్చాయన్నారు. సోషల్‌మీడియా ఎంత సహకారో అంత మహమ్మారి అని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనతో పాటల కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. తనతో ఇళయరాజాకు ఎలాంటి సమస్య ఉండదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment