చెన్నై: గాయకుడు, వ్యాఖ్యాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. అయితే వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఇంకా వెంటిలేటర్‌పైనే ఉంచి ఎక్మో పరికరంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా కరోనా బారిన పడిన ఆయన కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. (బాలు కోసం ప్రార్థనలు)
"నిన్నటి వరకు విషమంగా ఉన్న మా నాన్న ఆరోగ్యం నేడు నిలకడగా ఉంది. ఆయన కదులుతున్నారు, చేతులు ఆడిస్తూ థమ్సప్ సింబల్ చూపిస్తున్నారు. వైద్యులను గుర్తిస్తున్నారు. ఇప్పుడు కాస్త శ్వాస సులువుగా తీసుకోగలుగుతున్నారు. అందరినీ గుర్తిస్తున్నారు. ఇప్పటికైతే మాట్లాడలేకపోతున్నాడు కానీ త్వరలోనే అది కూడా జరిగి తీరుతుంది. వైద్యులపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందరి ప్రార్థనలు ఫలిస్తాయి. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉండటం ఆనందాన్నిచ్చే విషయం. మా తండ్రిపై, మా కుటుంబంపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యం మెరుగవడానికి సమయం పట్టొచ్చేమో కానీ తప్పకుండా కోలుకుంటారు" అని చరణ్ తెలిపారు. (నాకు కరోనా సోకింది: సింగర్ సునీత)
Comments
Please login to add a commentAdd a comment