ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నయనతార బాలు మృతికి సంతాపం తెలిపారు. తమ జీవితాల్లో బాలు స్వరం తోడుగా ఉందని తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దైవిక స్వరం ఇక లేదు. అన్ని రుతువుల.. అన్ని కారణాల స్వరం మీది. మీరు ఇక లేరని నమ్మడం ఎంతో కష్టంగా ఉంది. మా జీవితాల్లోని ముఖ్యమైన క్షణాల్లో మీ స్వరం మాకు తోడుగా ఉంది. ప్రతి తరంలోని వారు తమ భావోద్వేగాలన్నింటిని కనెక్ట్ అయ్యి ఉండే ఏకైక గాత్రం మీది మాత్రమే. మమ్మల్ని ఆహ్లాదపరిచే.. సేద దీర్చే ఆ గాత్రం ఇక లేదని నమ్మడం కష్టంగా ఉంది’ అన్నారు నయనతార. (చదవండి: బాలుపై అభిమానంతో ‘బామా’)
‘మీరు మీ స్వరంతో మాతో శాశ్వతంగా ఉంటారు. మా కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి మీకు కన్నీటి వీడ్కోలు ఇస్తున్నాము. మీ కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను’ అన్నారు నయనతార. కరోనా వైరస్ బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కానీ సెప్టెంబరు 24న ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. చివరకు శుక్రవారం మధ్యాహ్నం కన్ను మూశారు.
Comments
Please login to add a commentAdd a comment