
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా వైరస్ నుంచి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకుని క్షేమంగా ఇంటికి చేరాలని సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రార్థిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పెడుతున్నారు. ఎస్పీబీ కరోనాతో ఈనెల 5వ తేదీ ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామం ఆయన అభిమానులు, చిత్రరంగాన్ని కలచి వేస్తోంది. ఆయన త్వరగా కోలుకుని బయటకు రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి–రజనీకాంత్
ఎస్పీబీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్, నటుడు మోహన్, సినీ రచయిత, కవి వైరముత్తు సైతం అదే ఆంకాంక్షను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బాలు చికిత్స పొందుతున్న వార్డులో ఆయన ఆలపించిన సినిమా పాటలను ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నారు. స్వల్పంగా కరోనా వైరస్ సోకి హోం క్వారైంటెన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న ఎస్‌పీ బాలు సతీమణి సావిత్రి సైతం అదే ఆస్పత్రిలో ఉన్నారు. (కరోనా భయంతో వివాహిత ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment