సాక్షి,నెల్లూరు : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాతృమూర్తి శకుంతలమ్మ(89) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం 7 గంటలకు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం లండన్‌లో వున్నారు. రేపు ఉదయం నెల్లూరులో అంత్యక్రియలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment