ఎంజీఎం,న్యూస్‌లైన్: కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీ ఎం ఆస్పత్రి... సౌకర్యాలు, పరికరాల లేమీ, వైద్యుల కొరత వంటి కారణాలతో ‘యమ’జీఎంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, సర్కారు అలసత్వం వెరసి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎంజీఎంలో వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. అత్యవసర సమయూల్లో కృత్రిమ శ్వాస అందించేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు మూలకుపడ్డారుు. ఆర్‌ఐసీయూ వార్డులో ఉన్న పది వెంటిలేటర్లలో ఒకే ఒక్కటి పనిచేస్తుండడంతో వైద్యులు చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలు కావడం, క్రిమిసంహారక మందు తాగిన బాధితులు, పాము, తేలు కాటు బారిన పడినవారు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ వైద్యచికిత్సల కోసం నిత్యం ఎంజీఎం ఆస్పత్రికి పదుల సంఖ్యలో వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నారుు.
ఇలాంటి పరిస్థితుల్లో వారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారికి వెంటనే వెంటిలేటర్ల ద్వారా కృతిమ శ్వాసను అందిస్తూ చికిత్స చేయూల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా వైద్యసేవలు పొందాలంటే రోజుకు సుమారు *20 వేలు చెల్లించాలి. ఇంత ఖరీదైన వైద్యం పొందలేని నిరుపేదలు ఎంజీఎంకు రాక తప్పదు. కానీ... ప్రస్తుతం ఒకే ఒక్క వెంటిలేటర్ పనిచేస్తుండడంతో అక్కడ రోగుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలవక తప్పని పరిస్థితులు దాపురించారుు.
ఏడాదిగా మరమ్మతులు లేవు
ఎంజీఎం ఆస్పత్రిలోని ఆర్‌ఐసీయూ వార్డులో చైన్నయ్ ట్రాన్స్‌హెల్త్ కేర్ కంపెనీ నుంచి *12 లక్షల విలువ చేసే తొమ్మిది వెంటిలేటర్లతోపాటు ఎస్‌బీహెచ్ బ్యాంక్ అందించిన ఒక వెంటిలేటర్ ఉంది. వీటి మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ట్రాన్స్ హెల్త్ కేర్ కంపెనీకి అప్పగించారు. ఇందుకోసం ఆ కంపెనీకి ఏటా * నాలుగు లక్షలు చెల్లించాలి. అరుుతే 2011-12కు సంబంధించిన బిల్లులను ఆ కంపెనీకి సకాలంలో చెల్లించలేదు. దీంతో సదరు కంపెనీ వారు గత ఏడాది మెరుుంటనెన్స్ అందించకుండా చేతులేత్తేశారు. మరమ్మతుకు నోచుకోకపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆర్‌ఐసీయూ వార్డులోని ఏడు వెంటిలేటర్లు మూలకుపడ్డాయి. మిగిలిన మూడు వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా.... ప్రస్తుతం ఆ సంఖ్య ఒక్కటికి చేరింది.
వారంలో అందుబాటులోకి తెస్తాం
అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వెంటిలేటర్ల మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వాస్పత్రులకు ప్రత్యేకంగా బయోమెడిక ల్ ఇంజినీర్‌ను నియమిస్తే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. వెంటిలేటర్లను మరమ్మతు చేసే ఇంజినీర్లు అందుబాటులో లేకపోవడం, సరైన సమయంలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోవడమే కారణం. ప్రస్తుతం వెంటిలేటర్లను వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తాం.
- నాగేశ్వర్‌రావు, ఆర్‌ఎంఓ
‘వెంటిలేటర్’పై ఎంజీఎం!
Published Wed, Aug 7 2013 5:32 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM
Advertisement
Advertisement