మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : మండలంలోని మేడారంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ములుగు ఆర్డీఓ మోతీలాల్, డీఎస్పీ మురళీధర్, ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రె వెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. మేడారంలోని 161 సర్వే నంబర్‌లోగల ప్రభుత్వ భూముల్లో గిరిజనేతరుడు కోళ్ల రాజే శం నిర్మించుకున్న షెడ్‌ను ట్రాక్టర్ డోజర్‌తో పూర్తిగా తొలగించారు. గిరిజనుడు వత్తం లక్ష్మ య్య ఇంటిని తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతుండగా ఆయన అడ్డుకుని తన ఇం టిని తానే తొలగిస్తానని అధికారులను కోరడం తో కొంతమేరకు పాక్షికంగా కూల్చారు. సిద్ధబోయిన రవి నిర్మించిన బిల్డింగ్ స్లాబ్‌పై కట్టిన గోడను కూడా తొలగించారు. పోలీసులు వెళ్లిపోయూక గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఇళ్ల ను తొలగించొద్దని ఆర్డీఓను కోరారు.
ప్రభుత్వ భూముల్లో ఇకమీదట అక్రమంగా ఇళ్లను ని ర్మించకుండా చూస్తామని, ప్రస్తుతం నిర్మించుకున్న ఇళ్లకు మినహాయింపు ఇవ్వాలని సర్పం చ్ గడ్డం సంధ్యారాణి ఆర్డీఓను కోరగా ప్రభుత్వ భూమిలో ఇళ్లను కోల్పోరుున గిరిజనులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఆయన సమాధానమిచ్చారు.
తొలగించవొద్దని ఆత్మహత్యాయత్నం
ఇదిలా ఉండగా షెడ్‌ను తొలగించొద్దని కోళ్ల రాజేశం ఆత్మహత్యకు యత్నించాడు. షెడ్‌ను అధికారులు ట్రాక్టర్ డోజర్‌తో తొలగిస్తుండగా రాజేశం బయటకు రాకపోవడంతో ప్రమాదం జరుగుతుందని భావించిన అధికారులు బల వంతంగా బయటకు తీసుకొస్తుండగానే అత డు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని ఆటోలో తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాము ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశామని, షెడ్‌ను అధికారులు కూల్చడంతో తీవ్ర నష్టపోయూమని రాజేశం భార్య కన్నీరుపెట్టింది.
ముగ్గురిపై కేసు నమోదు
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మిం చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హతీరాం మంగళవారం తెలిపారు. మేడారంలోని 161 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూ మిలో కోళ్ల రాజేశం, వట్టం లక్ష్మయ్య, సిద్ధబోయిన రవి అక్రమంగా ఇళ్లు నిర్మించుకునట్లు రె వెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
మేడారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Published Wed, Aug 7 2013 5:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement