విద్యారణ్యపురి, న్యూస్‌లైన్: ‘సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ వారు వ్యతిరేకం కాదు.. నాటి నిజాం నిరుంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలది. నాటి నుంచి ప్రత్యేక రాష్ట్ర పోరు కొనసాగుతూనే ఉంది. దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆధిష్టానంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయూన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ’ అని అంటున్నారు విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య. హన్మకొండలో కొనసాగుతున్న ఇన్‌స్పైర్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన సోమవారం నగరానికి వచ్చా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన పలు అంశాలపై ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. చుక్కా రామయ్య ఏమంటున్నారో ఆయన మాటల్లోనే...
సమైక్యం పేరిట ఆందోళనలు సరికాదు
‘హైదరాబాద్ పదేళ్లపాటు ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని... ఆ తర్వాత అది తెలంగాణకు చెందుతుందని.. అంతేకాకుండా సీమాంధ్రకు ప్రత్యేక రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో ఇంకా ఏ అనుమానాలు అక్కర్లేదు. రెండేళ్లలో కూడా ఆంధ్ర ప్రాంతంలో రాజధానిని నిర్మించుకునే సత్తా వారికుంది. అలాంటప్పుడు అక్కడ సమైక్యం పేరిట ఆందోళనలు చేయడం సరికాదు. రాజకీయ పార్టీలు సహనం ప్రదర్శించాలి. తెలంగాణ విభజనను చిక్కుముడిగా మార్చొద్దు.
విడిపోయి కూడా సహకరించుకోవచ్చు
సరియైన వనరులు లేకున్నా ఫిన్‌లాం డ్, సింగపూర్ వంటి చిన్న దేశాలే అభివృద్ధి చెందాయి. అలాంటిది ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో వనరులున్నారుు. ఉభయు లూ విశాల హృదయంతో విడిపోయి... శ్రమపడి తెలుగుభాష మాట్లాడే ఆదర్శ రాష్ట్రాలుగా భవిష్యత్‌లో ఎదగవచ్చు. విడిపోయి కూడా పరస్పరం సహకరించుకోవచ్చు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతవాసులు భయపడాల్సిన అవసరం లేదు.
నిర్ణయం అమలులో జాప్యం చేయొద్దు
కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు జాప్యం చేయకుండా తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలి. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి నిర్ణయూన్ని వెంటనే అమలు పర్చాలి.
సామాజిక తెలంగాణ అవసరం
అనాదిగా తెలంగాణ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైన బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు చైతన్యవంతులై రానున్న ప్రత్యేక రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణగా పునర్మించుకోవాల్సిన అవసరం ఉంది.
సంపద ఉత్పత్తి చేసే విధంగా పునర్నిర్మాణం
తెలంగాణ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేధావులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వనరులను వినియోగించుకుని తమ భవిష్యత్‌ను తామే నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రజలు కృషిచేయాలి. సర్కారీ కొలువులు ఎప్పుడైనా తక్కువగానే ఉంటారుు. వాటిపైనే కాకుండా వనరులను వినియోగించుకుని సంపద ఉత్పత్తి చేసే విధంగా, ఉపాధి అవకాశాలు పొందేలా యువత కృషి చేయాలి.
దశాబ్దాల పోరాట ఫలితమే మా తెలంగాణ
Published Tue, Aug 6 2013 5:42 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement