
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనాతో మృతి చెందిన మహిళకు సంబంధించిన సమాచారం బంధువులకు ఇవ్వకుండానే అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ తల్లి చనిపోయిందని తెలుసుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లిన కుటంబసభ్యులకు మృతదేహం లేదని అధికారులు చెప్పారు. అంతేకాకుండా మృతదేహానికి అంత్యక్రియలు ఎక్కడ చేశారో కూడా తెలియజేయలేదు. దీంతో బంధువులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్‌కు చెందిన మహిళ ఈ నెల13న ఎంజీఎం అస్పత్రిలో కరోనా చికిత్స పొందుతు మృతి చెందారు. (తెలంగాణలో 90వేలకు పైగా కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment