ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న ఎంజీఎం ఆస్పత్రిలో పేద రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. వైద్య పరికరాలు, మందుల కొరత తీవ్రంగా ఉంది. సరైన సదుపాయాలు లేక సమస్యలతో కునారిల్లుతోంది. వీటికి పాలకుల నిర్లక్ష్యం... అధికారుల అలసత్వం తోడుకావడంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. వైద్య పరీక్షలకు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి రావడంతో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి.
ఏబీజీ పరీక్షలు
ఆర్‌ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులు, క్రిమిసంహారక మందు తాగిన వారికి ఎయిర్ ట్రియల్ బ్లడ్ గ్యాసెస్ (ఏబీజీ) పరీక్షలు అవసరం. ఎమర్జెన్సీ ల్యాబ్‌లో దీనికి సంబంధించిన వైద్య పరికరం ఉన్నప్పటికీ... మరమ్మతుకు నోచుకోక రెండు నెలలుగా మూలకుపడింది. ఈ పరీక్షకు ప్రైవేట్ సెంటర్‌లో సుమారు రూ.1,100 ఖర్చవుతుంది.
బ్లడ్ టెస్ట్
బ్లడ్ సెల్ కౌంటర్‌లో రోగుల రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజీ, ఎర్ర, తెల్ల రక్త కణాలు, డిఫరెన్షియల్ కౌంట్, ప్లేట్ కౌంట్స్‌ను పరీక్షిస్తారు. కెమికల్స్ లేకపోవడంతో రెండు రోజులుగా ఈ పరీక్షలు నిలిచిపోయాయి. రోజుకు 60 నుంచి 70 మంది వరకు రోగులు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రరుుస్తున్నారు. దీంతో
ఒక్కొక్కరిపై రూ.200
భారం పడుతోంది.
ఆర్‌ఏ, సీఆర్‌పీ...
కీళ్లనొప్పులు, బ్లడ్ ఇన్ఫెక్షన్‌కు కారణాలు తెలుసుకునేందుకు ఆర్‌ఏ, సీఆర్‌పీ, ఏఎస్‌ఓ పరీక్షలు చేస్తారు. కెమికల్స్ లేక ఆరు నెలలుగా ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పేద రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో సీఆర్‌పీ టెస్ట్‌కు రూ. 350, ఏఎస్‌ఓకు రూ.200,
ఆర్‌ఏకు రూ.150 వెచ్చించాల్సి వస్తోంది.
టూడీ ఎకో...
ఛాతినొప్పితోపాటు గుండె నొప్పితో వచ్చే రోగులకు టూడీ ఎకో ద్వారా స్కానింగ్ చేసి సమస్య ఎక్కడుందో తెలుసుకుంటారు. ఎంజీఎంకు ఈ పరికరం 2003లోనే వచ్చింది. మరమ్మతుకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం అది మూలన పడింది. దీంతో టూడీ ఎకో పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ సెంటర్‌కే పరుగులు పెడుతున్నారు. ఈ పరీక్షలకు రూ.650 అవుతోంది.
పెద్దాస్పత్రిలో అందని సేవలు
Published Fri, Dec 13 2013 3:22 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement