సాక్షి, చెన్నై : భారతీయ దిగ్గజ గాయకుల్లో ఒకరైన ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. 17 భాషల్లో 41 వేల 230 పాటలు పాడిన బాలు తమను వదిలి వెళ్లాడనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1966, డిసెంబర్ 15న ప్లేబ్యాక్ సింగర్‌గా తనన ప్రస్తానాన్ని ప్రారంభించిన బాలు.. వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలను అందుకుని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రాణాంతక కరోనా బారినపడిన కోలుకున్నప్పటికీ.. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో గురువారం సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్నాహ్యం తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు చరణ్ ప్రకటించారు.
ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు
Published Fri, Sep 25 2020 4:27 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
Advertisement