
సాక్షి, వరంగల్ : వైద్యుడు లేక ఎంజీఎం ఆసుపత్రిలో శనివారం పోస్టుమార్టం సేవలు నిలిచిపోయాయి. దీంతో మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సిన డెడ్‌బాడీలు నాలుగు ఉన్నాయి. నిబంధనల మేరకు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపు పోస్టుమార్టం చేయాల్సి ఉండగా, ఉదయం నుంచి డాక్టరు అందుబాటులో లేకుండా పోయారు. రేపు ఆదివారం కావడంతో పోస్టుమార్టం జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డెడ్‌బాడీలకు అంత్యక్రియల కోసం మృతుల ఇళ్ల దగ్గర బంధవులు వేచి చూస్తున్నారు.