
గాయపడిన మాధురి
ఎంజీఎం (వరంగల్): భర్తకు దూరంగా ఉంటున్న ఓ వివాహితపై యాసిడ్ దాడి చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో బుధవారం జరిగింది. వరంగల్‌కు చెందిన బోయిన మాధవి అలియాస్ మాధురికి డోర్నకల్‌కు చెందిన చంటికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ పాప జన్మించింది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఏడాదిగా మాధురి వరంగల్‌లోని తన పుట్టింట్లోనే ఉంటోంది.
కాగా ఆటోడ్రైవర్ చందు ఆమెను పెళ్లి చేసుకుంటానని వేధించేవాడు. వారం రోజుల క్రితం ఆమెపై అతడు దాడి చేయగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా బుధవారం రాత్రి ఆమెపై ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి వద్ద యాసిడ్ దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. స్థానికులు మాధురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment