
చెన్నై : కరోనా వైరస్ సోకి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులు బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉందని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఎస్పీ బాలు ఆరోగ్యాన్ని నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్యులు తెలిపారు.
ఇక సుమధుర గాయకులు ఎస్పీ బాలు సత‍్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు ఎంజీఎం ఆస్పత్రి ఎదుట ప్రార్ధనలు చేశారు. ఇక ఎస్పీ బాలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, సంగీత దిగ్గజం ఇళయరాజా సహా పలువురు సెలబ్రిటీలు, గాయకులు, బాలు అభిమానులు కోరుతున్నారు.
చిలుకూరులో ప్రత్యేక పూజలు
రంగారెడ్డి జిల్లా: గాన గంధర్వుడు, భక్తుల అభిమాన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని చిలుకూరులో విశేష అర్చన, నరసింహ స్వామి స్తోత్ర పారాయణ సభక్తికంగా నిర్వహించినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment