ఎంజీఎం ఆసుపత్రిలో గన్ కలకలం రేపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో
మరొకరి కోసం గాలింపు
పోచమ్మమైదాన్ :ఎంజీఎం ఆసుపత్రిలోగన్ క లకలం రేపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకర్ల సమావేశంలో అరెస్టు వివరాలను వె ల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. నల్లబె ల్లిమండలం నారక్కపేటకు చెందిన అజ్మీర నాగరాజు డైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందు లు తలెత్తడంతో ఇద్దరి భార్యలను పోషించలేక డబ్బులు సంపాధించే సులువైన మార్గంగా తుపాకి చూపించి బెదిరించి డబ్బులు వసులు చేయాలని నిర్ణయించుకున్నాడు.
తన మొదటి భార్యబంధువైన గాజులశంకర్‌తో కలిసి జార్ఖం డ్‌కు పనికోసం వెళ్లి పలు నేరాలకు పాల్పడ్డాడు. అక్కడ రూ. 12వేలకు నాటు తుపాకిని కొనుక్కొన్నాడు. బుధవారం అర్ధరాత్రి ఎంజీఎం ఆ సుపత్రిలో ఒంటరిగా ఉండే ప్రభుత్వ డాక్టర్‌ను గన్నుతో బెదిరించేందకు ప్రయత్నిస్తూ.. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. సిబ్బం ది అతడిని తనిఖీచేసి, తుపాకీని స్వాధీనం చేసుకుని విచారించినట్లు, గాజుల శంకర్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నాగరాజును రిమాం డ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మట్టెవాడ సీఐ శివరామయ్య పాల్గొన్నారు.