ఎంజీఎం ఆస్పత్రిలో ఆమ్రపాలి పర్యటన
Published Fri, Nov 11 2016 2:45 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని కలెక్టర్ ఆమ్రపాలి క్షుణ్నంగా పరిశీలించారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమె ఆస్పత్రి అంతా కలియదిరిగారు. అన్ని వార్డులను పరిశీలించి సమస్యలు, సౌకర్యాలపై అధికారులను, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సూపరింటెండెంట్ రమేష్, ఆర్‌ఎంవో ఉన్నారు. వెయ్యి పడకల ఈ ఆస్పత్రికి ఎంబీఏహెచ్ సర్టిఫికేషన్ సాధించటం కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమావేశమై చర్చించారు. ఆస్పత్రిలో దోభీఘాట్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులు వెచ్చించేందుకు నగర కమిషనర్‌తో మాట్లాడతామని చెప్పారు
Advertisement
Advertisement