శిశువు బతికున్నా.. చనిపోయిందన్నారు! | Negligence of doctors in the MGM hospital | Sakshi
Sakshi News home page

శిశువు బతికున్నా.. చనిపోయిందన్నారు!

Published Mon, Jul 3 2017 3:16 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

శిశువుకు పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

శిశువుకు పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల తీరుపై తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ
 
ఎంజీఎం (వరంగల్‌): శిశువు బతికున్నా.. చనిపోయిందని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు చెప్పారని వరంగల్‌ అర్బన్‌ హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్, స్వప్న దంపతులు, వారి బంధువులు ఆరోపించడం జిల్లాలో కలకలం రేపింది. స్వప్నకు మొదటి కాన్పు ఇటీవల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగింది. ఏడు నెలల గర్భవతిగా ఉండగానే ఆమె 450 గ్రాముల ఆడశిశువుకు జన్మనిచ్చింది. మెరుగైన వైద్యచికిత్స కోసం జూన్‌ నెల 30వ తేదీన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో వైద్యులు శిశువును నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని ఇంక్యుబేటర్‌లో మూడు రోజులుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం శిశువును పరీక్షించి, మృతి చెందిందని వైద్యులు పేర్కొని ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తక్కువ బరువుతో శిశువు జన్మించడంతో ఇలా జరిగిందన్న ఆవేదనతో బంధువులు శిశువు మృతదేహాన్ని పెగడపల్లి తీసుకువెళ్లి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే, ఈ సందర్భంగా శిశువులో కదలికలు కనిపించడంతో వారు తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఉలిక్కిపడిన వైద్యులు శిశువుకు మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలో పల్స్‌ ఆక్సిమీటర్‌తో పరీక్షించడంతో పాటు శిశువుకు ఆక్సీజన్‌ అందించి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, శిశువు మృతి చెందిందని వైద్యులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement