సవతి బాధితురాలు అనితకు అబార్షన్
హన్మకొండ చౌరస్తా: సవతితోపాటు ఆమె తరఫు బంధువులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన అనిత గర్భంలోనే శిశువు చనిపోయింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీతండాలో బానోత్ అనిత అనే వివాహితపై ఆమె సవతి తరఫు కుటుంబ సభ్యులు సోమవారం హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. వివస్త్రను చేసి ఒంటిపై కాల్చడం తో తీవ్రగాయాలతో బాధపడుతున్న అనితను మంగళవారం ఎంజీఎం ఆస్పత్రి నుంచి హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకొచ్చారు.
అనితను ఆరు నెలల గర్భిణిగా గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి గర్భస్థ పిండం మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అబార్షన్ తప్పనిసరి అని నిర్ణయించిన వైద్యులు అందుకోసం చికిత్స ప్రారంభించినట్లు జీఎంహెచ్ ఆర్‌ఎంవో సుదార్‌సింగ్ తెలిపారు. మరో రెండురోజులపాటు అనితకు వైద్యం అవసరమని వెల్లడించారు. ప్రస్తుతం అనిత ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
గర్భంలోనే శిశువు మృతి
Published Wed, Feb 10 2016 4:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement