Government maternity hospital
-
తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►మొత్తం పోస్టుల సంఖ్య: 34 ► పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్లు–03, థియేటర్ అసిస్టెంట్–04, ఏఎన్ఎంలు –09, ల్యాబ్ అటెండెంట్లు–04, అటెండీస్–05, వార్డ్ బాయ్స్–04, స్ట్రెచర్ బేరర్స్–05. ► అర్హత: పోస్టును అనుసరించి ఐదు, ఏడు, పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, వయసు ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా/నేరుగాగాని ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండ్, ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, తిరుపతి చిరునామాకు పంపించాలి. ►దరఖాస్తులకు చివరి తేది: 26.03.2021 ►వెబ్సైట్: https://chittoor.ap.gov.in/notice_category/recruitment/ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్‌లో 12 ఖాళీలు -
అమ్మా.. నీవెక్కడ!
ఓ అమ్మ పేగు బంధాన్ని మరిచింది. బిడ్డ పుట్టిన గంటలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆడపిల్ల పుట్టిందని వద్దనుకుందో లేకమరేదైనా కారణమో తెలియదు గానీ... ఆస్పత్రిలోనే పాపను అనాథగావదిలేసింది. పది రోజులైనా ఆ తల్లి తిరిగి రాలేదు. పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన యాస్మిన్ అనే యువతి ప్రసవం కోసం ఈ నెల 3న పేట్లబురుజు ఆస్పత్రిలో చేరింది. ప్రసవం జరిగిన గంట తర్వాత యాస్మిన్ అదృశ్యమైంది. పాప బలహీనంగాఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ,దూద్‌బౌలి: ఆడపిల్లల పట్ల సమాజంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అదృష్టంగా భావించాల్సిన ఆడపిల్లలను భారంగా తలుస్తున్నారు. పేగు తెంచుకు పుట్టిన పసికందును భారంగా భావించిన ఓ కన్నతల్లి ఆస్పత్రిలో అనాథగా వదిలేసి వెళ్లిన సంఘటన పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాలు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ఈ నెల 3వ తేదీ సాయంత్రం నవాబ్‌సాబ్‌కుంట ప్రాంతానికి చెందిన యాస్మిన్ అనే యువతి ప్రసవం కోసం పేట్లబురుజు ఆసుపత్రిలో చేరింది. గంటలోపే ఆడ పిల్లకు జన్మనివ్వడంతో ఆసుపత్రి వైద్యులు తల్లి, బిడ్డలకు వైద్య సేవలు అందించారు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి యాస్మిన్ తన పసికందును వదిలి వెళ్లిపోయింది. శిశువు బలహీనంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు తల్లి వస్తుందేమోనని ఎదురు చూశారు. ప్రసవ సమయంలో ఇచ్చిన చిరునామా ఆధారంగా విచారణ చేపట్టినా ఫలితం కనిపించలేదు. శిశువు ఆరోగ్యం మెరుగుపడటం, పదిరోజులైనా ఎవరూ రాకపోవడంతో ఆస్పత్రి అధికారులు సోమవారం చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసవానికి వచ్చిన సమయంలో సదరు మహిళ తన పేరు యాస్మిన్‌గా, భర్త పేరు ఎస్.కె.మస్తాన్‌గా నమోదు చేయించింది. నవాబ్‌సాబ్‌కుంటలో ఉంటున్నట్లు చిరు నామాలో పేర్కొంది. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశువు ఆరోగ్యంగా ఉంది కాన్పు అనంతరం తల్లి బిడ్డను వదిలి వెళ్లిపోవడంతో ఆస్పత్రి సిబ్బందే శిశువు ఆలనా పాలన చూస్తున్నారు. పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించి వైద్యసేవలు అందించాం. ప్రస్తుతం పాప ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ఘటనపై చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. శిశువును తీసుకె ళ్లేందుకు బంధువులెవరూ ముందుకు రాకపోతే... చిన్నారిని శిశు విహార్‌కు తరలిస్తాం. – డాక్టర్ నాగమణి, సూపరింటెండెంట్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి -
ఆడవాళ్లకు మాత్రమే!
సాక్షి, హైదరాబాద్: సుమారు 50 ఏళ్ల క్రితం ఓ హృదయవిదారక ఘటనతో ఆ ఆస్పత్రి ప్రారంభమైంది. ఏ ఉద్దేశంతో అయితే ఆ ఆస్పత్రి ప్రారంభమైందో.. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మహిళలతో మహిళల కోసం ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. అదే ముస్లిం మెటర్నిటీ జనానా అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. దేశంలోనే కాక ప్రపంచంలోనే మహిళలచే మహిళల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రి ఇది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ మహిళలతో మహిళల కోసం నిర్వహిస్తున్న ఓ ఆస్పత్రి.. హైదరాబాద్ మహా నగరంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. నగరం లోని చాదర్‌ఘాట్ సమీపంలోని ఉస్మాన్పుర ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉంది ఈ ఆస్పత్రి. నిర్వాహకుల అనుమతి తీసుకుని ఒకసారి లోపలికెళ్లి చూస్తే.. ఓ కొత్త వాతావరణం కనిపిస్తుంది. అక్కడ డాక్టర్లు మొదలుకుని సిబ్బంది వరకూ మహిళలే కనిపిస్తారు. ఈ ఆస్పత్రిలో ఆత్మీయ వాతావరణంలో రోగులను సిబ్బంది ఆప్యాయంగా పలకరిస్తారు. ఇలా ప్రారంభమైంది.. 1969లో నగరంలోని ఓ మార్వాడీ మహిళ పురిటి నొప్పులతో నయాపూల్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రసూతీ ఆస్పత్రిలో చేరింది. నొప్పులు పెరగటంతో ఆమెను లేబర్ రూమ్‌కు తీసుకెళ్లారు. డెలివరీ చేయడానికి లేబర్ రూమ్‌లో మగ డాక్టర్ మాత్రమే ఉన్నారు. దీంతో ఆ మహిళ మగ డాక్టర్ వద్ద డెలివరీ చేయించుకోడానికి నిరాకరించింది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె మగ డాక్టర్ ద్వారా డెలివరీ చేయించుకోనని.. ప్రాణం పోయినా సరే తన లజ్జను మరో వ్యక్తి ముందు తీసుకోనని సమాధానం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో మహిళా డాక్టర్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మహిళా వైద్యురాలు లేకపోవడంతో తీవ్ర నొప్పులతో ఆమె మరణించింది. ప్రసూతీ దవాఖానాలో మగ డాక్టర్ వద్ద వైద్యాన్ని నిరాకరించి ప్రాణాలు కోల్పోయిన మహిళ అని మరుసటి రోజు వివిధ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఆస్పత్రిలో వైద్య సేవలు.. ఈ ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అనుభవజ్ఞులైన మహిళా డాక్టర్లే చేస్తారు. ప్రసూతీ, మహిళా వ్యాధులు, సంతాన సాఫల్యత చికిత్సలతో పాటు శిశువుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పలు విభాగాలు కొనసాగుతున్నాయి. ల్యాప్రొస్కోపీ లాంటి అధునాతన టెక్నాలజీ సదుపాయం, నవజాత శిశువులకు ఎన్ఐసీయూ, పీఐసీయూ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. 24 గంటలు ఆరుగురు వైద్యులు వైద్య సేవలు అందిస్తారు. అలాగే మహిళలు, శిశువుల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఆస్పత్రిలో డాక్టర్లతో పాటు నర్సులు, వివిధ రకాల పరీక్షలు చేసే సిబ్బంది అంతా మహిళలే. మగవారికి ఆస్పత్రి లోపలికి ప్రవేశం ఉండదు. రోగులను చూడటానికి వచ్చే మగవారిని సాయంత్రం ఒక గంట పాటు అనుమతిస్తారు. మగవారు ఆస్పత్రికి వచ్చే సమయంలో అన్ని వార్డుల్లో పరదాలు కప్పేస్తారు. మహిళలతో మహిళల కోసం.. అప్పటికే నగరంలో ఖిద్మతే ఖల్క్ (ప్రజా సేవ) అనే పేరుతో అబ్దుర్రజాక్ అనే వ్యక్తి ఓ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో చలించిపోయిన ఆయన.. నగరంలోని డాక్టర్లను కలసి జరిగిన ఘటన గురించి వివరించారు. ఆ రోజుల్లో నగరంలో ఒకరో ఇద్దరో మహిళా డాక్టర్లు ఉన్నారు. వీరితోపాటు ఇతర డాక్టర్లతో సమావేశమై.. మగ డాక్టర్ వద్ద వైద్యం నిరాకరించి ప్రాణాలు వదిలిన మహిళ మాదిరిగా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని, డాక్టర్లంతా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి తమ సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని మహిళా డాక్టర్లు మహిళలకు వైద్యం చేయడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో స్త్రీ, పురుష డాక్టర్లు ఒక కమిటీగా ఏర్పడి ముస్లిం మెటర్నిటీ దవాఖానాను పురానీహవేలీలో ప్రారంభించారు. తొలుత 25 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి ఇప్పుడు చాదర్‌ఘాట్ ఉస్మాన్పురలో 350 పడకలతో ‘నో లాస్.. నో ప్రాఫిట్’పద్ధతిలో కొనసాగుతోంది. ఈ దవాఖానా నినాదం ‘మహిళలకు.. మహిళలతో వైద్యం’ ఇక్కడ చారిటబుల్ రేట్లలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. -
అమ్మా... గర్భిణుల విలాపం!
మరమ్మతుల కోసం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి ఖాళీ మూడు రోజులుగా ప్రసవ వేదన.. గర్భిణులు వస్తే..ఇతర ఆస్పత్రులకు సిఫార్సు పేట్లబురుజు, నిలోఫర్, గాంధీలోనూ చేదు అనుభవమే అల్లాడుతున్న నిరుపేద మహిళలు సిటీబ్యూరో పురిటి నొప్పులతో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే నిరుపేద గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. నొప్పులు భరించలేక కళ్లముందే కుప్పకూలుతున్నా.. వైద్య సిబ్బంది కనికరించడం లేదు. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ గోడలకు పగుళ్లు ఏర్పడటంతో నాలుగు రోజులుగా సిజేరియన్ ప్రసవాలు నిలిపేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను నిలోఫర్, గాంధీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అతికష్టం మీద ఆయా ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. పడకలు ఖాళీ లేక..తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇక్కడ అడ్మిషన్ చేసుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రరుుంచలేని నిరుపేదలు అల్లాడిపోతున్నారు. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా..సుల్తాన్ బజార్ ఆస్పత్రిలో డెలివరీలు నిలిపివేయడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 300 మంది గర్భిణులు వస్తుండగా, 200 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 30 ప్రసవాలు జరుగుతుంటారుు. ఆపరేషన్ థియేటర్లోని గోడలకు ఇటీవల పగుళ్లు ఏర్పడ్డారుు. దీనికి తోడు వార్డుల్లోని గోడలకు బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాపించింది. ఇది బాలింతలకు వ్యాపించే అవకాశం ఉండటంతో గత సోమవారం నుంచి ఆపరేషన్ థియేటర్‌ను మూసేసి మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అడ్మిటైన గర్భిణులను, బాలింతలను ఖాళీ చేరుుంచారు. తాజాగా వస్తున్న రోగులను పేట్లబురుజు, గాంధీ, నిలోఫర్, కింగ్‌కోఠి ప్రసూతి ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అంబులెన్స కూడా లేక పోవడంతో ఎవరికి వారే ఆటోల్లో వెళ్లిపోతున్నారు. నిరాకరించిన పేట్లబురుజు... ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చిన గర్భిణులను చేర్చుకుని చికిత్స అందించేందుకు పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో వైద్యుల నిష్పత్తికి మించి గర్భిణుల సంఖ్య ఉండటంతో...కొత్తగా ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చిన గర్భిణులకు తాము ప్రసవాలు చేయలేమని ఆ ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో వారిని గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు పంపుతున్నారు. అనేక వ్యయప్రయాసలకోర్చి ఆయా ఆస్పత్రులకు చేరుకున్న గర్భిణులకు తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. ఆయా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేక పోవడం, ఉన్నవాటిపై ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సర్దుకుంటుండటంతో చేసేది లేక వచ్చిన వారిని తిప్పి పంపుతున్నారు. నొప్పులు మొదలైన తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన గర్భిణులు మళ్లీ వచ్చే ఓపిక లేక ఆర్థికంగా భారమైనా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రరుుస్తున్నారు. చేరుు తడపాల్సిందే.. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో పుట్టిన ప్రతి బిడ్డకూ సిబ్బంది ధర నిర్ణరుుస్తున్నారు. తల్లిదండ్రులు తమ కన్నబిడ్డను కళ్లారా చూసుకోవాలంటే అడిగినంత (ఆడబిడ్డ పుడితే రూ.800, మగబిడ్డ పుడితే రూ.1500) ఇవ్వాల్సిందే. లేదంటే చీదరింపులు, చీత్కారాలే. దీంతో పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం చేరుుంచు కోవచ్చని భావించి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన పేదలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కీలకమైన విభాగాల్లో రెగ్యులర్ స్టాఫ్‌ను నియమించాల్సి ఉన్నా..కొంత మంది అధికారులు కాంట్రాక్ట్ సిబ్బందితో కుమ్మకై ్క అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో.. ఆ ఒక్కటీ అడక్కు..!
కానరాని పారిశుద్ధ్యం ప్రధాన ఆస్పత్రుల వార్డుల్లో దుర్వాసన గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లోనూ అదేతీరు రూ.కోట్లు వెచ్చించినా మెరుగు పడని పరిస్థితి సిటీబ్యూరో: రోగమొచ్చి ప్రభుత్వాస్పత్రికి వస్తే.. కొత్త రోగాలు అంటుతున్నాయి. ప్రధాన గేటు నుంచి మొదలయ్యే దుర్వాసన ప్రధాన వార్డుల్లోనూ వదలడం లేదు. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరెంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో ఉస్మానియా, గాంధీ సహా సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్టీ, ఫీవర్, ఛాతి, మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోని వార్డుల్లో దుర్వాసనకు రోగుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలు వ్యర్థాల్లో మురిగిపోతున్నాయి. బుధవారం పలు ఆస్పత్రుల్లో ‘సాక్షి’ పరిశీలించగా.. అక్కడి పరిస్థితితులు దారుణంగా కనిపించాయి. నిలోఫర్.. చిన్నారులకు డర్.. రాష్ట్రలోనే అతిపెద్ద చిన్నపిల్లల ఆస్పత్రిగా ‘నిలోఫర్’కు గుర్తింపు ఉంది. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. కానీ ఈ ఆస్పత్రిలో ఆ జాగ్రత్తలు మచ్చుకు కూడా కానరావు. నిలోఫర్‌లో పారిశుద్ధ్య నిర్వాహణకు ప్రభుత్వం నెలకు రూ.8.38 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాలి. కానీ ఇక్కడ అసలు ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి చేతులు కడిగేసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి వెలువడుతున్న బయె ూమెడికల్ వ్యర్థాలను వేరు చేయకుండా సిబ్బంది అన్నింటినీ ఒకే మూటలో కట్టేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిని బయటికి తరలించాల్సింది పోయి క్యాంటీన్ సమీపంలోని ఖాళీ స్థలంలో పోగేస్తున్నారు. వీటి మూలంగా చిన్నపిల్లలకు బాక్టీరియా, ఇతర వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఇన్ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్టు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం శుభ్రత ఇలా ఉండాలి.. ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. ఓపీని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ ధియేటర్లను ఐదుసార్లు శుభ్రపరచాలి.ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్ల చొప్పున శుభ్రపరచాలి.{పతి 15 రోజులకోసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి.నెలకోసారి వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలి. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలి. దీన్ని శానిటేషన్ ఏజెన్సీలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. వార్డులను తడిగుడ్డతో ఊడ్చుతున్నారే తప్ప కనీసం ఫినాయిల్ కూడా వాడటం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఉస్మానియాలో అవినీతి ‘కంపు’ కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ‘ఉస్మానియా’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.29 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ 270 మందికి 200 మందికి మించి కార్మికులు లేరు. దీంతో ఓపీతో పాటు ఇన్ పేషంట్ వార్డుల్లో చెత్త పేరుకు పోయి తీవ్ర దుర్వాసన వె దజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఎన్ఐసీయూ పక్కనే టాయిలెట్లు పొంగుతున్నాయి. వార్డుకు సమీపంలోనే మూత్ర విసర్జన చేస్తుండటంతో ఆ పరిసరాలు దారుణంగా ఉన్నాయి. అవుట్ పేషంట్ వార్డుతో పాటు కులీ కుతుబ్‌షా భవనంలో డ్రైనేజ్ లీకవుతోంది. వార్డుల్లో చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయక పోవడంతో నీరు తాగిన రోగులు కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు. సిరెంజ్లు, బ్లేడ్స్ వంటి క్లినికల్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. మారని ‘గాంధీ’ తీరు.. గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులకు ప్రభుత్వం నెలకు రూ. 23.7 లక్షలు ఖర్చు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి వ్యర్థాలను తొలగించక పోవడంతో వార్డులు చెత్త కూపాలుగా మారిపోయాయి. ఇక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వాహణ దారుణంగా ఉంది. ఆస్పత్రి ఆవరణలో క్లినికల్ ప్లాంట్ ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. లేబర్ రూమ్‌తో పాటు పలు వార్డుల్లోని పారి శుద్ధ్య నిర్వాహణ అత్యంత అద్వానంగా మారింది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సైతం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షాత్తూ గవర్నర్ హెచ్చరించినా ఆస్పత్రిలోని పారిశుద్ధ్య నిర్వహణ తీరు మాత్రం మారకపోవడం గమనార్హం. ‘పేట్లబురుజు’లో నిర్లక్ష్యం.. బహదూర్‌పురా: పేట్లబురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆస్పత్రిని లేబర్ రూంలో పారిశుద్ధ్యం అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. ఆవరణలోని క్యాంటీన్ బయట డ్రైనేజీ మురుగునీరు నిలిచిపోతున్నా సరిచేసే దిక్కులేదు. రోగులకు ఆహారం సరఫరా చేసే క్యాంటీన్లోనూ అపరిశుభ్రత తాండవిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో 69 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల ప్రభుత్వం రూ. 15 లక్షల నిధులను ఆల్ గ్లోబల్ సర్వీసు సంస్థ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఆసుపత్రి వ్యర్థాలు, చెత్తను తొలగించడం, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడంలో కాంట్రాక్టర్ అసలు పట్టించుకోవడం లేదు. తక్కువ సిబ్బందితో పని కానిచ్చేస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు, వారి సహాయకులు అపరిశుభ్ర వాతావరణంతో రోగాల బారిన పడుతున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
సవతి బాధితురాలు అనితకు అబార్షన్ హన్మకొండ చౌరస్తా: సవతితోపాటు ఆమె తరఫు బంధువులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన అనిత గర్భంలోనే శిశువు చనిపోయింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీతండాలో బానోత్ అనిత అనే వివాహితపై ఆమె సవతి తరఫు కుటుంబ సభ్యులు సోమవారం హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. వివస్త్రను చేసి ఒంటిపై కాల్చడం తో తీవ్రగాయాలతో బాధపడుతున్న అనితను మంగళవారం ఎంజీఎం ఆస్పత్రి నుంచి హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకొచ్చారు. అనితను ఆరు నెలల గర్భిణిగా గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి గర్భస్థ పిండం మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అబార్షన్ తప్పనిసరి అని నిర్ణయించిన వైద్యులు అందుకోసం చికిత్స ప్రారంభించినట్లు జీఎంహెచ్ ఆర్ఎంవో సుదార్‌సింగ్ తెలిపారు. మరో రెండురోజులపాటు అనితకు వైద్యం అవసరమని వెల్లడించారు. ప్రస్తుతం అనిత ఆరోగ్యం బాగానే ఉందన్నారు. -
రెండ్రోజులైనా లభించని పసికందు ఆచూకీ
-
కోఠిలో గర్భిణుల బైఠాయింపు
హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓపీని గురువారం సిబ్బంది ఆలస్యంగా తెరవడం రోగులను గందరగోళపరి చింది. ఆసుపత్రిని వేరే చోటుకు తరలించేందుకే ఓపీని తెరవలేదని భావించిన గర్భిణులు తమ బంధువులతో కలసి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో గర్భిణులు వైద్య పరీక్షల నిమిత్తం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన ఓపీ ఎంతకీ తెరవకపోవడంతో చికిత్సకు వచ్చినవారు కలవరపడ్డారు. అక్కడి నుంచి ప్రసూతి ఆసుపత్రిని తరలించారని ఇక వైద్యసేవలు అందవని కొందరు చెప్పడంతో వందలాది మంది రోగులు ఆగ్రహంతో కోఠి ఉమెన్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించారు. దీంతో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా నుండి ఇసామియాబజార్, చాదర్‌ఘాట్, ఇటువైపు సుల్తాన్‌బజార్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌చౌరస్తా, బ్యాంక్‌స్ట్రీట్, ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు. ఆసుపత్రి వర్గాలు కూడా అప్రమత్తమై ఓపీని తొమ్మిది గంటలకు తెరవడంతో పరిస్థితి సద్దుమణిగింది. రోగులు, ఆసుపత్రి సిబ్బంది మధ్య సమాచారం కొరవడడం వల్లే గందరగోళానికి దారితీసినట్లు తెలుస్తోంది. -
వ్యాక్సిన్ మాయ
వ్యాక్సిన్ పేరుతో రోగులను దోచుకుంటున్న వైనం దళారుల అవతారమెత్తుతున్న ఆస్పత్రి వైద్య సిబ్బంది ఒక్క ఫోన్ చేస్తే చాలు నేరుగా పేషంట్ వద్దకే.. రూ.లక్షల్లో దండుకుంటున్న ఏజెన్సీలు, వైద్య సిబ్బంది ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు కలసి వ్యాక్సిన్ పేరుతో పేదలను దోచేస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన మహిళలను, ప్రసవానంతరం వారి అవసరాన్ని బట్టి వేసే వ్యాక్సిన్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. దళారుల అవతారమెత్తిన కొందరు వైద్య సిబ్బంది కనుసన్నల్లో ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ‘సాక్షి’ నిఘాలో ఈ దందా వెలుగులోకి వచ్చింది. - తిరుపతి కార్పొరేషన్ రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రికి రోజుకు వందల సంఖ్యలో గర్భవతులు వైద్యసేవలకోసం వస్తూంటారు. నెల లు నిండిన గర్భవతులకు ఇక్కడే కాన్పు లు చేస్తుంటారు. ఈనేపథ్యంలో సహజంగా అధికశాతం ప్రసవం అనంతరం పురిటి బిడ్డలకు కామెర్లు వస్తుంటాయి. దీని నివారణకు హెపటైటిస్ బి వ్యా క్సిన్ వేయాల్సి ఉంది. అయితే కొంత కాలంగా ప్రభుత్వం వ్యాక్సిన్‌ను సరఫరా చేయకపోవడంతో దీన్ని కొంతమంది వైద్యులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆస్పత్రిలోని సిబ్బంది ద్వారా ఏజెన్సీలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని దళారుల అవతారమెత్తుతున్నారు. డీపీసీఏ యాక్టు ప్రకారం వ్యాక్సిన్లు, ఇతర మందులను నేరుగా ఆస్పత్రి ఆవరణలో రోగులకు విక్రయించకూడదు. డీపీసీఏ (డ్రగ్ప్రైజ్ కంట్రోల్ యాక్టు) నిబంధనలకు తూట్లు పొడుస్తూ రెట్టింపు ధరకు యథేచ్ఛగా విక్రయిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నారు. రోగులకు కుచ్చు టోపీ ప్రసవానంతరం పురిటి బిడ్డకు 24 గంటల్లోపు కామెర్ల నివారణకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా వైద్యుల సిఫార్సు చేస్తే మెడికల్ షాపు నుంచి వ్యాక్సిన్ తెప్పించుకుంటారు. కానీ ఇక్కడి వైద్యులు మాత్రం నగరంలోని ఓ ఏజెన్సీతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటున్నారు. రోగి అవసరం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాక్సిన్ కోసం ఫలానా ఏజెన్సీకి వెళ్లండి, లేకుంటే ఫలానా ఫోన్ నెంబ రుకు కాల్ చేయండి వాళ్లే మీ వద్దకు తెచ్చిస్తారు’ అని నమ్మిస్తున్నారు. పైగా ఆసుపత్రుల్లోని గోడలపై ఆ సెల్ నెంబర్లు రాస్తున్నారు. వైద్యులు, సిబ్బంది మాటల ఉచ్చులో పడి ఫోన్ నెంబర్ కాల్ చేయడంతో దళారులు నిమిషాల్లో ఆస్పత్రిలోని రోగి ముందు ప్రత్యక్షమై వ్యాక్సిన్ విక్రయించి అందిన కాడికి దోచుకొంటున్నారు. సాధారణంగా రూ.1000 నుంచి రూ.3500 వరకు హెపటైటిస్-బి వ్యాక్సిన్లు లభిస్తుంటాయి. తాజాగా సాక్షి నిఘాలో భాగంగా ఏజెన్సీ సెల్‌కు కాల్చేస్తే ఓ వ్యక్తి ఎంఆర్పి ధర రూ.7వేలు అని ముద్రించి ఉన్న వ్యాక్సిన్‌ను తెచ్చి విక్రయించాడు. ఇదే వ్యాక్సిన్‌ను మెడికల్ షాపులో చూపించి ధరను విచారించగా రూ.3,500 విక్రయిస్తున్నట్టు తెలి పారు. అంటే ఏజెన్సీ వారు రోగికి రూ.7వేలుకు విక్రయించి ఆపై వచ్చిన ఆదాయం (రూ.3,500) వైద్యులు, సిబ్బందికి ముట్టజెప్పుతున్నారని తె లుస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే ఏజెన్సీ వారు ఇస్తే తాను విక్రయించానని, ఇం దులో ఆసుపత్రిలోని వైద్యాధికారుల కు కమీషన్ ఇస్తున్నామని తెలిపారు. విచారణ జరిపిస్తాం ఆసుపత్రుల్లో హెపటైటిస్-బీ వ్యాక్సిన్ సరఫరా లేదు. దీంతో స్లిప్‌ల్లో రాసి మెడికల్ షాపుల్లో తెమ్మని చెబుతున్నాం. కొనుగోలులో కొందరు వైద్యులు, సిబ్బంది హస్తం ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా బాధితులు నా దృష్టికి తెస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యాక్సిన్ విక్రయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాను. -యశోదాబాయి, ఆర్ఎంవో, మెటర్నటీ ఆసుపత్రి