బూజు దులిపేద్దాం
జడ్చర్ల : గత ప్రభుత్వాల పాలనలో గబ్బు పట్టిన విధానాల మబ్బు దులుపుతున్నాం. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించే దిశగా అనేక విధి విధానాలలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం స్థానిక చంద్రగార్డెన్‌లో జరిగిన ఈద్‌మిలాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లీం సోదరులనుద్దేశంచి సుధీర్ఘ ప్రసంగం చేశారు.గత పాలకుల నిర్లక్షం,నిర్లిప్తత కారణంగా సమాజం వెనుకబాటుకు గురయ్యిందని ఆరోపించారు. కల్తీ విత్తనాలు,కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ మందులు, అంతా కల్తీమయంగా తయారై రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ మంచి ఆలోచనలతో మార్పు తీసుకువచ్చే విదంగా చర్యలు చేపట్టారని అన్నారు.
కల్తీ విత్తనాలు, తదితర వాటిపై పీడీ యాక్టును అమలు చేస్తున్నారని, అదేవిదంగా గుడుంబా నియంత్రణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియల మార్పులు, శాంతిభద్రతల అమలు, తదితర అనేక రంగాలలో మార్పులు తీసుకురావడం జరిగిందని గుర్తుచేశారు. సెక్యులరిజానికి పెట్టింది పేరుగా ఉన్న మన దేశంలో తెలంగాణ ముందుందన్నారు. హిందూముస్లీంల ఐక్యత ఇక్కడ ఉన్న విదంగా మరెక్కడా లేదన్నారు. హైద్రాబాద్‌లో హిందూముస్లీంల ఐక్యతను నాడు మహాత్మాగాందీ ప్రశంసించారని గుర్తు చేశారు.
ముస్లీం, క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, తదితర అనేక సంక్షేమ కార్యక్మాలను అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలకే ఏటా రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక అభవృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని,సీఎం కేసీఆర్‌కు తమ తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల చేసిన సర్వేలు సైతం మళ్లీ టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారని వెళ్లడవుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్,జడ్పీటీసీ ప్రబాకర్‌రెడ్డి,వైస్‌ఎంపీపీ రాములు,పీసీఎస్ చైర్మెన్‌బాల్‌రెడ్డి,కోఆప్శన్ ఇమ్ము,మత పెద్దలు ఫీజ్‌ఉర్‌రహెమాన్, అజీజ్‌రహెమాన్, సుల్తాన్‌కీస్తీ, అబ్దల్‌కరీం, శేక్‌చాంద్, జాఫర్,యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు.