కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి : లక్ష్మారెడ్డి | minister laxma reddy speaks over deputy cm mohammed ali swine flu condition | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి : లక్ష్మారెడ్డి

Published Sun, Jan 29 2017 11:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి : లక్ష్మారెడ్డి

కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి : లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : స్వైన్‌ఫ్లూ సోకి చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కోలుకుంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నగరంలోని ఫిల్మ్‌నగర్ దుర్గాభవాని నగర్‌లో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. స్వైన్‌ఫ్లూ వచ్చిందని ఆందోళన చెందవద్దని, చికిత్స ద్వారా నయమవవుతుందని, దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే పల్స్ పోలియోకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement