
ఆరోగ్యశ్రీపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్షించారు. ట్రస్టు కార్యకలాపాలు, పథకం అమలు తీరు పరిశీలించారు. సోమవారం జరిగిన సమీక్షలో మంత్రి.. పేదలకు అందించాల్సిన వైద్య సౌకర్యాలు మెరుగు పరిచే ప్రతిపాదనలను పరిశీలించారు. ఆరోగ్య మిత్రల పనితీరు అధ్యయనం చేశారు. సిబ్బందిని పని ఆధారంగా కేటాయించాలని, పని తక్కువ ఉన్న వారిని, పనిభారం ఉన్న వారిని రేషనలైజ్ చేయాలన్నారు. సిబ్బందికి అందుతున్న అదనపు 30శాతం భత్యంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఇంటెన్సివ్ కేర్ సేవల్లో లోపం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.