2015-16 బడ్జెట్‌కు గానూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది.
- నేడు ఆర్థిక శాఖకు ప్రతిపాదన
హైదరాబాద్: 2015-16 బడ్జెట్‌కు గానూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా ఉన్నతాధికారులు బుధవారం సమావేశమై రూ.8 వేల కోట్ల బడ్జెట్‌కు కసరత్తు పూర్తిచేశారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌కు ఆ ప్రతిపాదనలను గురువారం సమర్పించనున్నారు. ఆరోగ్యశాఖ డెరైక్టరేట్‌కు రూ.1200 కోట్లు, వైద్యవిద్యా శాఖకు రూ.1700 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.500 కోట్లు, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.1330 కోట్లు, వైద్య విధాన పరిషత్‌కు రూ.420 కోట్లు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే వైద్య ఆరోగ్యశాఖకు చెందిన నిమ్స్, ఆయుష్ తదితర సంస్థలకు కూడా బడ్జెట్ ప్రతిపాదనలు తయారుచేశారు.