ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన మంత్రి | minister laxma reddy clears trafic in kaleswaram route | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన మంత్రి

Published Sun, Jul 19 2015 11:31 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన మంత్రి - Sakshi

ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన మంత్రి

కరీంనగర్: గోదావరి పుష్కరాలు ప్రభుత్వ అమాత్యులను ట్రాఫిక్ పోలీసులుగా మార్చాయి. ధర్మపురికి వెళ్లే దారిలో ట్రాఫిక్ నియంత్రించే కార్యక్రమంలో నిన్న మంత్రలు ఈటల రాజేందర్, హరీశ్ రావు, ఎమ్మెల్యే గంగుల కమాలకర్, భద్రాచలంలో తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీశ్ రెడ్డి పాల్గొనగా ఆదివారం కాళేశ్వరంలో అలాంటి బాధ్యతలనే మంత్రి లక్ష్మారెడ్డి తీసుకున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న భక్తుల కారణంగా కాళేశ్వరం వెళ్లే దారిలో ట్రాఫిక్ కిక్కిరిసి ఉండటంతో దానిని క్లియర్ చేసే బాధ్యతలను మంత్రి లక్ష్మారెడ్డి తీసుకున్నారు. వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో అధికారులంతా రోడ్ల వెంటన డీజీల్, పెట్రోల్, మంచినీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా..100కి ఫోన్ చేయొచ్చని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement