కాళేశ్వరం (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న గోదావరి పుష్కరాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ పుష్కరాల్లో తొలిరోజు కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. వేదపండితుల మంత్రోత్సవాల మధ్య ఆలయ గోపురం నుంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు పాల్గొని పుష్కరస్నానం చేశారు.
గోదావరి ప్రవహించే తీరంలో ఉన్న ఏకైక శైవక్షేత్రం కాళేశ్వరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎటు చూసినా ఆధ్యాత్మికం.. భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత పవిత్ర క్షేత్రం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు. తొలి రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
త్రివేణి సంగమం.. భక్త జనసంద్రం
Published Tue, Jul 14 2015 11:41 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement