కాళేశ్వరం: కరీంనగర్ జిల్లాలోని సుప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రానికి గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శనివారం రంజాన్ సెలవు దినం కూడా కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం 4 లక్షల మంది పుణ్య స్నానం చేయగా... శనివారం మధ్యాహ్నానికే ఈ సంఖ్య దాటిపోయింది. సుమారు 4 లక్షల మందికి పైగా స్నానాలు ఆచరించి కాళేశ్వర, ముక్తేశ్వరుణ్ణి దర్శించుకున్నారు.
కాగా, భక్తులు ఎక్కువ మంది ప్రత్యేక వాహనాల్లో రావడంతో కాటారం నుంచి కాళేశ్వరం మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 9 గంటల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. సాధారణంగా కాటారం నుంచి కాళేశ్వరం మధ్య 30 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ వాహనాల రద్దీతో శనివారం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది.
కాళేశ్వరం.. భక్త జనసంద్రం
Published Sat, Jul 18 2015 2:05 PM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement