!['ముస్లిం, మైనార్టీలపై టీడీపీకి ప్రేమ లేదు' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41418970002_625x300.jpg.webp?itok=B-hp8cxD)
'ముస్లిం, మైనార్టీలపై టీడీపీకి ప్రేమ లేదు'
హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీ వర్గాలపై టీడీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భూమా మాట్లాడుతూ... రాష్ట్రంలో హజ్హౌస్ భవనం శంకుస్థాపనకే పరిమితమైందని విమర్శించారు. భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అయితే హజ్ హౌస్ నిర్మాణాన్ని గుంటూరు నగరంలో చేపట్టాలని నగర తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు నగరం రాజధాని అతి సమీపంలో ఉండటమే కాకుండా రైలు, రహదారి, వాయు మార్గాలకు అతి సమీపంలో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో హౌజ్ హౌస్ గుంటూరులో ఏర్పాటు చేయాలని తెలిపారు.