గుంటూరు జిల్లాలో 'పోరుబాట'
గుంటూరు : ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో పోరుబాట నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటి వివరాలు....
సత్తెనపల్లి: మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
చిలకలూరిపేట: మండల కేంద్రంలో మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
నరసరావుపేట: స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
గుంటూరు: ఆర్డీవో కార్యాలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో లేళ్ల అప్పిరెడ్డి, కావేటి మనోహర్ నసీర్ అహ్మద్, లాంపురం రాముతోపాటు రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మంగళగిరి: స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
పిడుగురాళ్ల: మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ నేత జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
తెనాలి, కొల్లిపర: మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమాలలో అన్నాబత్తుని శివ కుమార్, గుదిబండ చిన వెంకటరెడ్డి, వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
పొన్నూరు: మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ నేత రావి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలతోపాటు రైతులు, మహిళలు పాల్గొన్నారు.
మాచర్ల: మండల కేంద్రంలో కూడా వైఎస్ఆర్ సీపీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో వైఎస్ఆర్ సీపీ నేతలు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కర్లపాలెం: స్థానిక మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
చుండూరు: మండల కేంద్రం వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకుడు మేరుగ నాగార్జున, ధర్నా నిర్వహించారు.
రేపల్లే: స్థానిక తాహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో డ్వాక్రా మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.