ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్రి కులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గతేడాది రాష్ట్రం నుంచి 4,900 మంది యాత్రికులను మక్కాకు పంపగా, ఈ ఏడాది ఎక్కువ మందిని పంపేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. హైదరాబాద్‌లో ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్నందున వారి సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు.
సోమవారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో హజ్ యాత్రకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఆయన విడుదల చేశారు. హజ్ యాత్రికులకు మక్కాలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ సలీమ్, ఫరూక్ హుస్సేన్ హజ్‌కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌ఏ షుకూర్ తదితరులు పాల్గొన్నారు.