Haj pilgrims
-
ముస్లింలకు ప్రభుత్వ వరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ముస్లింలకు అనేక వరాలు ఇవ్వడంతోపాటు వారిని విద్యావంతుల్ని చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ముస్లిం నాయకులు కితాబిచ్చారు. ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా అనేక నిర్ణయాలు తీసుకోవడంపై పలువురు ముస్లిం నాయకులు ఏపీ మైనార్టీ శాఖ ముఖ్యకార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ను శనివారం విజయవాడలో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో ముస్లింల విద్యకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిధుల విడుదల తదితర విషయాలను ఇంతియాజ్ వారికి వివరించారు. కర్నూలులోని అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.51.40 కోట్లు మంజూరు చేశారన్నారు. దీంతోపాటు గుంటూరులో అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీ శాఖ ఏర్పాటుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారన్నారు. ఇప్పటికే ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ ఉర్దూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో ఎంఏ అరబిక్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని 175 మదర్సాలలో ఆధునిక విద్య (మోడ్రన్ ఎడ్యుకేషన్) బోధించేందుకు అవసరమైన టీచర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉర్దూ స్కూళ్లలో టీచర్ల నియామకాలకు నిధులు రూ.17 కోట్లు మంజూరు చేసిందని ఇంతియాజ్ వివరించారు. ‘గత ప్రభుత్వం ఎంతో వివక్ష చూపింది’ ముస్లిం నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మైనార్టీ లపై తీవ్రమైన వివక్ష చూపిందని, కనీసం ముస్లింల సమస్యలు చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చివరకు మైనార్టీ శాఖను కూడా వారికి కాకుండా చేసారన్నారు. తమ సమస్యలపై ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ రూ.14.51 కోట్లు విడుదల చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందుకు చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి బీఎస్ అంజాద్ బాషా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్, మజ్లిసుల్ ఉలేమా ప్రతినిధులు ముఫ్తి అబ్దుల్ బాసిత్, ముఫ్తి యూసుఫ్, ముఫ్తి హబీబ్ మౌలానా, డాక్టర్ ఇషాక్, మౌలానా ఫారూఖ్ సిద్దిఖ్, కృష్ణా జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రెహమాన్, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి అబ్దుల్ మతీన్, మహమ్మద్ ఖలీలుల్లా, షఫీ అహ్మద్ పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): హజ్ యాత్రికులపై అదనపు భారం పడకుండా ఆదుకుని అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్‌లాజమ్ అధ్యక్షతన విజయవాడలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ గౌస్‌లాజమ్ మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,813 మందిపై దాదాపు రూ.83 వేల వంతున అదనపు భారం పడుతుందని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించారని చెప్పారు. రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ రూ.14.51 కోట్లు విడుదల చేయడం ముస్లిం సమాజం పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సమావేశం సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. హజ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సమావేశంలో చర్చించారు. హజ్ యాత్రికులకు బస, భోజనం, నీరు, రవాణా తదితర ఏర్పాట్లుకు హజ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హజ్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, ముస్లిం మతపెద్దలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికులకు రూ.14.51 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో హజ్ యాత్రికులను చిన్నచూపు చూశారని, అప్పటి టీడీపీ నాయకుడు సుజనాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ కనీసం విజయవాడకు ఎంబార్కేషన్ పాయింట్ కూడా సాధించలేకపోయారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడకు ఎంబార్కేషన్ పాయింట్ తీసుకురావడంతోపాటు హజ్ యాత్రికులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ ముస్లిం మై నార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్, ఎంఎస్ బేగ్, మతపెద్దలు మహ్మద్ అక్బర్‌బాషా, డీఎస్ హబీ బుల్లా, నసీర్ అహ్మద్ ఉమ్రీ, ముక్తి అబ్దుల్ బాషిత్, ముక్తి అబ్దుల్ హాబీబ్ తదితరులు మాట్లాడారు. చదవండి: ఉదయం నుంచే భగభగ వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు రాయితీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయడాన్ని హర్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మంగళవారం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం లభి స్తోందని చెప్పారు. ప్రతి ముస్లిం సోదరుడు సీఎం జగనన్నకు ఎళ్లవేళలా అండగా నిలుస్తారని పేర్కొన్నారు. అనంతరం ముస్లిం మైనార్టీ పెద్దలు ప్రత్యేక దువా నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం మై నార్టీ నాయకులు ఎండీ హఫీజుల్లా, షేక్ అమిత, మున్షీ, జిలాని, రెహ్మాన్, ఖలీముల్లా తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు మంత్రి పదవి ఇస్తా
సాక్షి, అమరావతి: ముస్లింలకు మంత్రి పదవి ఇస్తామని, ఈ అంశంపై కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హజ్ యాత్ర ప్రారంభించింది తానేనని, హైదరాబాద్‌లో హజ్ భవన్ నిర్మించింది కూడా తానేనని తెలిపారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం ఆయన హజ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాత్రికులతో సమావేశమయ్యారు. విజయవాడలో రూ. 80 కోట్లతో హజ్ భవన్ నిర్మిస్తున్నామని, కడపలో మరో హజ్ భవన్ నిర్మిస్తున్నామని తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి మహనీయులు భూములు విరాళంగా ఇచ్చారని, ఆ వక్ఫ్ భూములను కొందరు స్వార్థపరులు కబ్జా చేశారన్నారు. ముస్లింల భూములు కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వక్ఫ్ భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ముస్లింల అభ్యున్నతికి ఈ బడ్జెట్లో రూ. 1,100 కోట్లు కేటాయించామని తెలిపారు. 1,35,000 మంది ముస్లిం విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లకు రూ. 285 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విదేశీ విద్యకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తామన్నారు. గతంలో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రాజీనామాకు తాను పట్టుబట్టానని తెలిపారు. అనంతరం యాత్రికులకు దుస్తులు, బ్యాగ్‌లను అందించారు. కృష్ణయ్య సూక్తులు పుస్తకం ఆవిష్కరణ టీటీడీ మాజీ ఈవో పి.కృష్ణయ్య రచించిన శ్రీ సూక్తుల పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. శుక్రవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబు కృష్ణయ్యను అభినందించారు. తమిళ ఆధ్యాత్మిక రచన తిరుక్కురళ్‌కు అనువాదం శ్రీ సూక్తులు పుస్తకమని, నైతికత, ధర్మ బోధనలకు ఈ పుస్తకం ద్వారా అక్షర రూపమిచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. బీఎస్ఈలో సీఆర్డీఏ బాండ్ల లిస్టింగ్.. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజి (బీఎస్ఈ)లో సీఆర్డీఏ బాండ్లను లిస్టింగ్ చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. బాండ్ల జారీకి సంబంధించిన బిడ్డింగ్ వచ్చే మంగళవారం జరుగుతుందని, 10.3 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శుక్రవారం రాజధాని వ్యవహారాలపై సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15కి వంద అన్న క్యాంటీన్లు డిసెంబర్ నాటికి విజయవాడ, గుంటూరులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. తిరుపతిలో 27 కిలోమీటర్లు ప్రాంతం మేర స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రారంభించిన అన్న కాంటీన్ల గురించి మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా నిర్వహణ ఉండాలని పురపాలక డైరెక్టర్ కన్నబాబుకు సీఎం సూచించారు. ఇప్పటికే 66 అన్న కాంటీన్లు ప్రారంభమయ్యాయని, మరో వంద కాంటీన్లను ఆగష్టు 15వ తేదీకల్లా ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. సమీక్షలో మున్సిపల్, పరిపాలన శాఖ శాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు -
హజ్ యాత్రికులకు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. హజ్ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మందిపై సబ్సిడీ భారం పడనుంది. ఇప్పటివరకూ హజ్ యాత్రకు వెళ్లేవారికి ప్రతి ఏటా రూ. 700 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. హజ్ యాత్రకు సబ్సిడీ నిలుపుదల వల్ల మిగిలే డబ్బును మైనార్టీ బాలికలు, మహిళల సంక్షేమానికి వినియోగిస్తామని నక్వీ పేర్కొన్నారు. హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ద్వారా ఏజెంట్లు మాత్రమే లాభపడుతున్నారని, ముస్లింలు లాభం పొందడం లేదని అన్నారు. -
హజ్ యాత్రికులు 12 నుంచి మదీనాకు ప్రయాణం
హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి హజ్ కమిటీ ద్వారా ఎంపికైన హజ్ యాత్రికులు ఈ నెల 12 నుంచి మదీనా నగరానికి వెళ్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ సోమవారం తెలిపారు. హజ్ ఆరాధనల్లో భాగంగా మదీనాకు వెళ్తున్నట్లు చెప్పారు. 10 రోజులపాటు మదీనాలోని మస్జీదే నబవీలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు చెప్పారు. ఇక్కడి నుంచి మక్కా నగరానికి ఎలా వెళ్లారో అదే పద్ధతిలో మక్కా నుంచి గ్రూప్‌ల వారీగా మదీనాకి వెళ్తారన్నారు. అనంతరం ఈ నెల 21 నుంచి నగరానికి తిరుగు ప్రయాణం అవుతారన్నారు. -
హజ్ యాత్రికులకు నౌకాయాన సదుపాయం
- వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేంద్రమంత్రి నఖ్వీ - 2018 నుంచి కొత్త హజ్ పాలసీ సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్రికులకు నౌకాయాన సదుపాయం కల్పించేందుకు నౌకాయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌యాత్రకు ఎంపికైనవారికి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 1994 వరకు హజ్‌యాత్రకు నౌకల ద్వారానే వెళ్లేవారని, అప్పట్లోనే ఒక నౌకలో ఒకేసారి దాదాపు 2 వేల మంది వరకు యాత్రికులు వెళ్లే అవకాశం ఉండేదన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త హజ్ పాలసీ రానుందని, హజ్‌యాత్ర తక్కువ ఖర్చు, యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం హజ్ కమిటీకి కేవలం రూ.కోటిన్నర కేటాయిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల హజ్ కమిటీల కంటే తెలంగాణ హజ్ కమిటీ యాత్రికులకు సౌకార్యాలు కల్పించడంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాం రుబాత్‌లో వసతులకు డ్రా
- ప్రభుత్వ చొరవతో మక్కాలోని రుబాత్‌లో ఏర్పాట్లు - హజ్ యాత్రికుల సౌకర్యాల కోసం రూ.3 కోట్లు - ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చొరవతో హజ్ యాత్రికులకు మక్కాలోని నిజాం రుబాత్‌లో మళ్లీ వసతులు లభించాయని ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ వివరించారు. శనివారం చౌమహల్లా ప్యాలెస్‌లో ఈ వసతుల కోసం డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఐదో నిజాం మక్కాలో ఐదు భననాలను కొనుగోలు చేశారన్నారు. గతంలో ఆ భవనాల్లో హజ్ యాత్రికులకు ఉచితంగా వసతులు కల్పించేవారన్నారు. తరువాత నిజాం రుబాత్, నిజాం ట్రస్టు మధ్య వివాదాలతో వసతులు కల్పించడం మానేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో వసతుల కల్పనకు అంగీకారం కుదిరింద న్నారు. రుబాత్‌లో 1,283 మందికి వసతులు ఉండగా, ఇందులో నిజాం రాయల్ ఫ్యామిలీకి 10 శాతం కేటాయించారన్నారు. మిగతా 1,152 మంది యాత్రికుల్లో డ్రా నిర్వహిం చామన్నారు. రుబాత్‌కు ఎంపికైన వారికి రూ. 44 వేలు ఆదా అవుతుందని వివరించారు. యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిం దన్నారు. రుబాత్‌లో వసతులతో పాటు భోజనం అందజేయనున్నట్లు రుబాత్ నిర్వాహకుడు హుస్సేన్ షరీఫ్ చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్, రాష్ట్ర మైనార్టీ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, నిజాం టస్టు చైర్మన్ నవాబ్ ఖైరుద్దీన్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 11న హజ్ యాత్ర షురూ
రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ సాక్షి, హైదరాబాద్: 2017 హజ్ యాత్రికులు ఈ ఏడాది సౌదీ ఎయిర్‌లైన్స్ విమానాల ద్వారా ఆగస్టు 11 నుంచి హజ్ ఆరాధనలకు వెళుతున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో యాత్రికులు వెళ్లేవారని.. ఈసారి మార్పు జరిగినట్లు చెప్పారు. కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర యాత్రికుల విమానాలు ఆగస్టు 11–22 మధ్య బయలుదేరతాయని తెలిపారు. యాత్రికులు ఇక్కడి నుంచి ఎహెరామ్ (హజ్ ఆరాధన దుస్తులు)ల్లో జిద్దా వెళ్లి అక్కడి నుంచి మక్కా నగరానికి వెళతా రన్నారు. ఈ ఏడాది నుంచి మక్కా, మదీన నగరాల్లో ఆరాధనల సందర్భంగా వసతుల ఖర్చులు పెరిగాయన్నారు. మీనా, ముస్దలీఫాలో మౌల్లిమ్ ద్వారా మూడుపూటల భోజన ఏర్పాటు ఉందన్నారు. ప్రతీ ఏడాది హజ్ కమిటీ తరుఫున ఫోన్ సిమ్ కార్డులు ఇచ్చే వారని, ఈ ఏడాది నుంచి యాత్రికులే సిమ్‌కార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిద్దా ఎయిర్‌పోర్టులో సిమ్‌కార్డులను తీసుకునే సౌకర్యం ఉందన్నారు. -
హజ్ యాత్రికుల ఎంపికపూర్తి
-
హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్రి కులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గతేడాది రాష్ట్రం నుంచి 4,900 మంది యాత్రికులను మక్కాకు పంపగా, ఈ ఏడాది ఎక్కువ మందిని పంపేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. హైదరాబాద్‌లో ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్నందున వారి సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు. సోమవారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో హజ్ యాత్రకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఆయన విడుదల చేశారు. హజ్ యాత్రికులకు మక్కాలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ సలీమ్, ఫరూక్ హుస్సేన్ హజ్‌కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. -
భోజనం కూడా పెట్టలేదు
- హజ్ యాత్రికులపై ఇండియన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం - ఉన్నతాధికారులకు హజ్ కమిటీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.30 గంటలకు సౌదీ అరేబియా మదీనా నుంచి బయలుదేరిన విమానం మధ్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మధ్యాహ్నం కనీసం భోజనం కూడా ఇవ్వలేదని, షుగర్ పేషెంట్లు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాత్రికులు తెలిపారు. ఈ విషయమై వారు ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండీ లియాఖత్ అలీ ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుకూ హజ్ కమిటీ ఫిర్యాదు చేసింది. పది విమానాల్లో హైదరాబాద్ చేరిన హజ్ యాత్రికుల్లో ఏపీకి చెందిన వారు 1,027 మంది ఉన్నారని లియాఖత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించండి
- హజ్ యాత్రికులను కోరిన డిప్యూటీ సీఎం - మక్కాకు బయలుదేరిన తొలి విమానం సాక్షి, హైదరాబాద్ : పవిత్ర హృదయంతో రాష్ట్రాభివృద్ధి, సుఖశాంతుల కోసం మక్కాలో ప్రార్థించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హజ్ యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ క్యాంప్ వద్ద ‘హజ్ యాత్ర-2016’ను ఆయన ప్రారంభించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ వద్ద ఎయిర్ ఇండియా విమానానికి జెండా ఊపి యాత్రికులను సాగనంపారు. తొలి విమానంలో 340 మంది యాత్రికులు బయలు దేరారు. ప్రార్థనలు విజయవంతంగా ముగించుకొని సుఖ సంతోషాలతో తిరిగి రావాలని ఆకాం క్షించారు. మక్కా మదీనా లోని కాబా వద్ద ప్రపంచంలో ఎవరికీ దక్కని అతిథి మర్యాదలు హైదరాబాదీలకు లభిస్తాయన్నారు. నిజాం ప్రభువు కాబాకు సమీపంలో రుబాత్ అతిథి గృహాన్ని నిర్మించడంతో అప్పటి నిజాం స్టేట్‌లోని తెలంగాణ రాష్ట్ర యాత్రికులను అతిథులుగా గుర్తిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హజ్ యాత్రికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం హజ్ యాత్ర కోసం రూ.3 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధమన్నారు. కార్యక్రమంలో ఆలిండియా హజ్ కమిటీ చైర్మన్ చౌదరి మహమూద్‌అలీ ఖైసర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ సలీమ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. -
హజ్‌యాత్రికులకు మెరుగైన ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్రికులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ వెల్లడించారు. ఆది వారం స్థానిక ఆజాంపురాలోని సహిఫా మసీదులో ఏర్పాటు చేసిన హజ్‌యాత్ర అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హజ్‌యాత్రికుల కోసం హజ్‌హౌస్‌లో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదారబాద్ క్యాంప్ నుంచి యాత్రికులు బయలుదేరి మక్కా మదీనాలో ప్రార్థనలు పూర్తి చేసుకొని తిరిగి క్యాంపునకు చేరుకునే వరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సదుపాయలతో కూడిన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హజ్ యాత్ర–2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని, నిర్దేశించిన ఫ్లైట్ షెడ్యూలు కంటే రెండు రోజుల ముందు క్యాంప్‌కు చేరుకోవాలని సూచించారు. మక్కా మదీనాలో సైతం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రుబాత్ బసకు ఎంపికైన వారికి మాత్రం బస రుసుం తిరిగి చెల్లిం చడం జరుగుతుందన్నారు. హజ్‌యాత్రపై పూర్తి స్థాయి అవగాహన చేసుకొని విజయవతంగా ప్రార్థనలు ముగించుకొని రావాలని ఆయన ఆకాంక్షిం చారు. కుల్‌హింద్ కార్యదర్శి, మాజీ రాష్ట్ర హజ్ కమటీ సభ్యుడు సయ్యద్ అబుల్ పత్హే బందగి బాషా రియాజ్ ఖాద్రీ, హజరత్ సయ్యద్ అజమ్ అలీ సుఫీ తదితరులు పాల్గొన్నారు. -
మక్కా విషాదంలో పెరుగుతున్న మృతులు
-
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘హజ్ యాత్రికులు పవిత్ర హృదయంతో చేసే ప్రార్థనలకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం.. ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గంగా జమున సంస్కృతి కొనసాగే విధంగా ప్రార్థించండి’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ హౌస్‌లో హజ్‌యాత్ర-2015ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టైన కార్యక్రమంలో మాట్లాడుతూ మక్కా మదీనాలో హజ్ ప్రార్థనలు చేయాలని కోట్లాది మంది కోరుకుంటారని, అందులో కొందరు అదృష్టవంతులకే అవకాశం దక్కుతుందన్నారు. పవిత్ర హృదయాలతో హజ్ యాత్రలకు వెళ్తున్నారని, ప్రార్థనలు విజయవంతంగా ముగించుకొని సుఖ సంతోషాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. మక్కా మదీనా లోని కాబా వద్ద ప్రపంచంలో ఎవరికీ దక్కని అతిథి మర్యాదలు హైదరాబాదీలకు దక్కుతున్నాయన్నారు. నిజాం ప్రభువు కాబాకు సమీపంలో రుబాత్ అతిథి గృహాన్ని నిర్మించడంతో అప్పటి నిజాం స్టేట్‌లోని తెలంగాణ రాష్ట్ర యాత్రికులను అతిథులుగా గుర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంతి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా బడ్జెట్ కేటాయింపులో మైనార్టీలకు పెద్ద పీట వే సిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సౌదీలోని మక్కా మదీనాలో వివాదాస్పదంగా మారిన రుబాత్ సమస్యను సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించగలిగామని, రుబాత్‌లో ఈసారి 597 మంది యాత్రికులకు ఉచిత బస కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మేరాజ్, షకీల్, ఎమ్మెల్సీ సలీమ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జీడీ అరుణ, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫీయుల్లా, రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఎం. షుకూర్, మౌలానా ముఫ్తీ ఖలీల్, ఆల్ మేవా చైర్మన్ మహ్మద్ ఖమ్రురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాం రుబాత్‌లో హజ్ యాత్రికులకు ఉచిత బస: మహమూద్
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2015 సందర్భం గా నిజాం రుబాత్‌కు ఎంపికైన యాత్రికులకు ఉచిత బసతోపాటు భోజనం, లాండ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని మక్కా మదీనాలో నిజాం రుబాత్ సమస్య పూర్తిగా పరిష్కారమైందన్నారు. రుబాత్లోని రెండు భవనాల్లో యాత్రికులకు బస ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు జిల్లాకొక రెసిడెన్షియల్ స్కూల్, వసతిగృహాలను నెలకొల్పుతోందని తెలి పారు. త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ముగ్గురు జడ్జి ల ప్యానల్‌తో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
నిజాం రుబాత్‌కు హజ్ యాత్రికుల ఎంపిక
హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ చొరవతో హైదరాబాద్ హజ్ హౌస్ ద్వారా మక్కా‘నిజాం రుబాత్’ భవనంలో ఉచిత బసకు హజ్ యాత్రికుల ఎంపిక పూర్తయింది. శనివారం హజ్ హౌస్‌లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఏ షుకూర్, రుబాత్ కార్య నిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అలీ షరీఫ్ సమక్షంలో కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ ఆన్లైన్ డ్రా ద్వారా హజ్ యాత్రికుల ఎంపిక నిర్వహించింది. పాత హైదరాబాద్ స్టేట్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 585 మంది యాత్రికులు ఎంపికయ్యారు. మరో 12 రాయల్ ఫ్యామిలీలకు కూడా రుబాత్‌లో ఉచిత బస కల్పించనున్నారు. కాగా మక్కాలో హజ్ యాత్రికులందరికీ డ్రాతో సంబంధం లేకుండా ఉచిత వసతి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని మహమూద్ అలీ పేర్కొన్నారు. -
ఒకే కుటుంబంలోని 9 మందికి స్వైన్ ఫ్లూ!
హైదరాబాద్: పాతబస్తీ సైదాబాద్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది శనివారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో బంధువులు వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ అసుపత్రికి తరలించారు. వారికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. ఇటీవలే వీరంతా హజ్ యాత్రకు వెళ్లి వచ్చారని వారి కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. హజ్ యాత్ర వెళ్లి వచ్చిన నాటి నుంచి వారందరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు. గత అర్థరాత్రి వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. -
హజ్ యాత్రికులకు కెసిఆర్ వీడ్కోలు
-
హజ్ యాత్రకు మెరుగైన సదుపాయాలు: సుష్మా
న్యూఢిల్లీ: హజ్ యాత్రికుల సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. హజ్ వార్షిక యాత్రకు భారత్ కోటాలో విధించిన 20శాతం కోతను ఉపసంహరించుకునేలా సౌదీ అరేబియాను కోరతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హాజ్ యాత్రికుల ప్రయాణ ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుతామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. హజ్ యాత్రపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిల భారత సదస్సులో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. హజ్ యాత్రికులనుంచి టికె ట్ చార్జీ వసూలులో ఎయిరిండియా తీరును ఆమె తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఎంపిక చేసిన ఇతర విమానాశ్రయాలనుంచి హజ్‌యాత్రకు టికెట్‌కు రూ. 62,800 వసూలు చేస్తున్నారని, శ్రీనగర్‌నుంచి హజ్ యాత్రకు మాత్రం రూ. 1.54లక్షలు వసూలు చేస్తున్నారని ఇది కాశ్మీర్ ప్రజలకు భారం కాగలదని అన్నారు. కాశ్మీర్ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు.