
నిజాం రుబాత్‌లో హజ్ యాత్రికులకు ఉచిత బస: మహమూద్
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2015 సందర్భం గా నిజాం రుబాత్‌కు ఎంపికైన యాత్రికులకు ఉచిత బసతోపాటు భోజనం, లాండ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని మక్కా మదీనాలో నిజాం రుబాత్ సమస్య పూర్తిగా పరిష్కారమైందన్నారు. రుబాత్‌లోని రెండు భవనాల్లో యాత్రికులకు బస ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు జిల్లాకొక రెసిడెన్షియల్ స్కూల్, వసతిగృహాలను నెలకొల్పుతోందని తెలి పారు. త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ముగ్గురు జడ్జి ల ప్యానల్‌తో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.