ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్రికులతో మొట్టమొదటి విమానం సెప్టెంబర్ 7న వారణాసిలోని బాబట్పూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని ఆ రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు,పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి మహమ్మద్ అజాంఖాన్ శుక్రవారం లక్నోలో వెల్లడించారు.
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులు రెండు రోజుల ముందుగానే లక్నోలోని హజ్ హౌస్కు చేరుకోవాలని ఆయన యాత్రికులకు సూచించారు. తదుపరి విమాన సర్వీసులు హజ్ యాత్రికులను తీసుకు వేళ్లేందుకు సెప్టెంబర్ 9న లక్నో, న్యూఢిల్లీ నగరాల నుంచి బయలుదేరుతాయని అజాంఖాన్ తెలిపారు.