పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కడమే అతడికి ఒక రకంగా శాపంగా మారింది. ప్రతిభ లేకున్నా కేవలం ‘బంధుప్రీతి’ కారణంగా ఆజం ఖాన్‌ను సెలక్ట్ చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అదే విధంగా.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చెత్త ప్రదర్శన నమోదు చేయడంతో అతడిపై ట్రోలింగ్ తారస్థాయికి చేరింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌కే సిగ్గుచేటు’’ అంటూ ఆజం ఖాన్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
మరికొంత మందైతే ఆజం ఖాన్ ఆకారాన్ని గేలి చేస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఫిట్‌నెస్ లేకున్నా ఇలాంటి వాళ్లను ప్రపంచకప్ జట్టుకు ఎలా ఎంపిక చేస్తారంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విమర్శల దాడికి దిగుతున్నారు.
ఇలా తనను ఉద్దేశించి.. సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ రావడంతో ఆజం ఖాన్ మానసిక వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన పోస్టులన్నింటీని అతడు డిలీట్ చేసేశాడు. ఇందుకు సంబంధించి తన ఫాలోవర్ల(రెండు లక్షలకు పైగా)కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అకస్మాత్తుగా ఇన్‌స్టా నుంచి మాయమైపోయాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పూర్తిగా విఫలం
కాగా మెగా టోర్నీకి ముందు తన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఆజం ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే.
రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. మిగతా రెండింటిలో ఆతిథ్య ఇంగ్లండ్ పాక్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఆజం ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు.
మాజీ కెప్టెన్ కుమారుడు
రెండో టీ20లో 11 పరుగులు మాత్రమే చేసిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. నాలుగో టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అదే విధంగా.. వికెట్ కీపర్‌గానూ కీలక సమయంలో క్యాచ్‌లు మిస్ చేసి పరోక్షంగా పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడు. కాగా పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజం ఖాన్.
కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు 25 ఏళ్ల ఆజం ఖాన్. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి.. 135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు.
Azam khan deleted all his Instagram posts after massive criticism 💔 pic.twitter.com/vXG6Cx34Vw
— The Einsteins (@theeinsteinss) June 3, 2024
Comments
Please login to add a commentAdd a comment