సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రలో రోగాల బారిన పడకుండా ఉండేందుకు హజ్ యాత్రికులంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సూచించారు. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో హజ్‌యాత్రికులకు వ్యాక్సినేషన్ శిబిరాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..హజ్ యాత్రకు దాదాపు 150 వివిధ దేశాల నుంచి భక్తులు మక్కాకు వస్తారని, రాష్ట్ర యాత్రికులు అక్కడ రోగాల బారిన పడకుండా ముందస్తుజాగ్రత్తగా టీకాలు వేయిస్తున్నట్లు తెలిపారు. హజ్ యాత్రికులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, వారికోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి హజ్ క్యాంప్ ఏర్పాట్లలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. అనంతరం హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ మాట్లాడుతూ..హజ్ యాత్రికుల గురువారం నుంచి మూడ్రోజుల పాటు హజ్‌హౌస్‌లో వ్యాక్సినేషన్ ఇస్తారని, జిల్లా యాత్రికులకు జిల్లాలో టీకాలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ ఈఓ షఫీవుల్లా, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment