
వక్ఫ్ బోర్డ్ చీఫ్ హత్యకు కుట్ర పన్నిన దావూద్ అనుచరుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : యూపీ షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ వసీం రిజ్వీ హత్యకు కుట్ర పన్నిన ముగ్గురు దావూద్ ఇబ్రహీం అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ సూచనలతోనే వీరు రిజ్వీ హత్యకు పథకం రచించారని తెలిసింది.
ముగ్గురు దావూద్ అనుచరులను అతిఫ్, అబ్రార్, సలీంలుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితులను యూపీలోని బులంద్‌షహర్‌లో అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం వెల్లడించారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే రిజ్వీ హత్యకు దావూద్ తన అనుచరులను ప్రేరేపించినట్టు తెలిసింది. రిజ్వీ హత్య కుట్రను ఛేదించి, నిందితులను అరెస్ట్ చేయడంతో పెనుముప్పు తప్పిందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment