సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రోహిత్ కేసు క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు.
వేముల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవన్న పోలీసులు.. వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చారు. పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని రిపోర్టులో తేల్చారు.
కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్యపై గతంలో 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు సైతం 8 సంవత్సరాల క్రితం పోలీసులు జోడించారు. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ కారణమని ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment