సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఒంటి గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
ఇక, తాజాగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల మందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి ఒంటి గంట వరకే ముగించాలి. ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి. ఈవెంట్స్‌లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. పార్టీల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు.
అలాగే, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ధం ఉండకూడదు. ఈవెంట్స్‌లో కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదు. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దు. లిక్కర్ సంబంధిత ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయవద్దు.
Comments
Please login to add a commentAdd a comment