కేంద్ర హోంమంత్రి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎస్పీ భాస్కరన్
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటించే ‘కేంద్ర హోంమంత్రి దక్షత పథక్’ అవార్డుకు రెండు విభాగాల్లో కలిపి మొత్తం 26 మంది తెలంగాణ పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు, భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్ విభాగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), అసోం రైఫిల్స్‌తోపాటు నేర దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఫోరెన్సిక్ సైన్స్ సిబ్బందికి ఈ అవార్డులు ఇస్తున్నారు.
2024కు గాను మొత్తం 463 మంది సిబ్బంది అవార్డులకు ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ నుంచి స్పెషల్ ఆపరేషన్ ఫీల్డ్ విభాగంలో ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ భాస్కరన్. ఆర్, ఇన్‌స్పెక్టర్లు భీసం హరిప్రసాద్, కాంపల్లి శ్రీనివాస్, చీగూరి సుదర్శన్‌రెడ్డి, గ్రూప్ కమాండర్ జాజాల రాఘవేంద్రరెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు చారి రాంబాబు, డొంకల రాంబాబు, సోము గౌతంరెడ్డి, పొన్న సంతోష్‌కుమార్, దుండిగల్ల రాజేశ్, ఏఆర్‌ఎస్సై మహ్మద్ ముజీబ్, హెడ్‌కానిస్టేబుళ్లు దేవులపల్లి మోహన్‌రెడ్డి, పండరి రవీందర్, సీనియర్ కమాండోలు తిప్పని రాకేశ్, ఉడుతనూరి మల్లేశ్, కానిస్టేబుళ్లు కడారి హరిబాబు, అంగీల జిడియో డార్లింగ్ మార్కస్, డి.రామచంద్రారెడ్డి, మదారి నాగరాజు, పట్లావత్ రాజేందర్, కేసరి శ్రీకాంత్æ గౌడ్, జూనియర్ కమాండో గంటా సాయి కుమార్ ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐపీఎస్ అధికారి సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి పులిమామిడి, డీఎస్పీ సత్యనారాయణ దీపు, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి మామిళ్ల ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment