SP Bhaskaran
-
తెలంగాణ పోలీస్‌కు కేంద్ర పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటించే ‘కేంద్ర హోంమంత్రి దక్షత పథక్’ అవార్డుకు రెండు విభాగాల్లో కలిపి మొత్తం 26 మంది తెలంగాణ పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు, భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్ విభాగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), అసోం రైఫిల్స్‌తోపాటు నేర దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఫోరెన్సిక్ సైన్స్ సిబ్బందికి ఈ అవార్డులు ఇస్తున్నారు.2024కు గాను మొత్తం 463 మంది సిబ్బంది అవార్డులకు ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ నుంచి స్పెషల్ ఆపరేషన్ ఫీల్డ్ విభాగంలో ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ భాస్కరన్. ఆర్, ఇన్స్పెక్టర్లు భీసం హరిప్రసాద్, కాంపల్లి శ్రీనివాస్, చీగూరి సుదర్శన్‌రెడ్డి, గ్రూప్ కమాండర్ జాజాల రాఘవేంద్రరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు చారి రాంబాబు, డొంకల రాంబాబు, సోము గౌతంరెడ్డి, పొన్న సంతోష్‌కుమార్, దుండిగల్ల రాజేశ్, ఏఆర్ఎస్సై మహ్మద్ ముజీబ్, హెడ్‌కానిస్టేబుళ్లు దేవులపల్లి మోహన్‌రెడ్డి, పండరి రవీందర్, సీనియర్ కమాండోలు తిప్పని రాకేశ్, ఉడుతనూరి మల్లేశ్, కానిస్టేబుళ్లు కడారి హరిబాబు, అంగీల జిడియో డార్లింగ్ మార్కస్, డి.రామచంద్రారెడ్డి, మదారి నాగరాజు, పట్లావత్ రాజేందర్, కేసరి శ్రీకాంత్æ గౌడ్, జూనియర్ కమాండో గంటా సాయి కుమార్ ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐపీఎస్ అధికారి సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి పులిమామిడి, డీఎస్పీ సత్యనారాయణ దీపు, ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి మామిళ్ల ఉన్నారు. -
సీఎం పర్యటన బందోబస్తు.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, భూపాలపల్లి : రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖరరావు తన తొలి అధికార పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. దానిలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లిలో కేసీఆర్ సోమవారం పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఓ విషాదం చోటుసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ పోలీసు ప్రాణాలు విడిచాడు. వివరాలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వజ్జ నారాయణ (ఏ ర్ హెచ్ సి 521)కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జయశంకర్ జిల్లా ఎస్పీ భాస్కరన్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించారు. (కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్) -
మావోయిస్టులకు రెండే దారులు
లొంగిపోవడమా.. చావడమా: ఎస్పీ భాస్కరన్ చిట్యాల: ‘‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు.. తుప్పుపట్టిన సిద్ధాంతాలు అవలంభిస్తున్న మావోయిస్టు పార్టీలో ఉన్న వారికి లొంగిపోవ డమా.. లేదా చనిపోవడమా అనే మార్గాలే ఉన్నాయని’’జయశంకర్ భూపాల పల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ అన్నారు. జిల్లాలోని చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని అందుగుతండాలో రెండు మండలాలకు చెందిన ప్రజల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. -
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు దంపతులు ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. కుక్కల గణపతి అలియాస్ రాజుతోపాటు అతని భార్య చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప వ్యక్తిగత కారణాల వల్ల లొంగిపోయారని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. వీరిద్దరు చర్ల-వెంకటాపూర్ ఏరియా కమిటీలో దళ సభ్యులుగా పని చేశారన్నారు.