సాక్షి, విజయవాడ/కర్నూలు: ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించారు. ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆస్పత్రి అనుమతి పత్రాలు తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు అంటున్నారు. తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ బాధితుల అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్స్‌లకు అనుమతి ఇస్తున్నారు. సాధారణ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు.
చదవండి: ‘ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు.. చంద్రం’
ఎంతో కీలకమైన ఆక్సిజన్ గురించి ఇవి తెలుసుకోండి
పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆంక్షలు..
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జోగులంబా గద్వాల జిల్లా అలంపూర్ పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. తెలంగాణలో ఆక్సిజన్, బెడ్స్ కొరత కారణంగా ఇతర రాష్ట్రాల రోగులకు అనుమతి నిరాకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment