సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంతో అనేక ఇబ్బందుల పాలవుతున్న ఉద్యోగులు పోరుబాట బట్టారు. తమకు జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. పైలట్లతోపాటు ఫ్లైట్ అటెండర్స్, గ్రౌండ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఢిల్లీ విమానాశ్రాయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సేవ్ జెట్‌ఎయిర్‌వేస్ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని కోరారు. సంస్థ భవిష్యత్‌పై ఆందోళన వ్యక‍్తం చేసిన పలువురు ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అటు దాదాపు 2వేల మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ముంబైలో ప్రదర్శన నిర్వహించారు.
కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అటు విమానాలకు అద్దెబకాయిలు చెల్లించలేక ఇప్పటికే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముఖ్యంగా సోమవారం దాకా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment