
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు కంపెనీ వద్ద డబ్బుల్లేవని జెట్‌ఎయిర్ వేస్ తన ఉద్యోగులకు స్పష్టం చేసింది. మంగళవారంతో కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ రెన్యువల్ గడువు తీరిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్ 17 నుంచి సంస్థ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.
‘‘రుణదాతలు లేదా ఇతర మార్గాల నుంచి అత్యవసరంగా నిధులు అందే పరిస్థితి సమీపంలో లేదు. దీంతో గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు అవసరమైన నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో కంపెనీ ఉంది’’ అని జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా సమాచారం ఇచ్చారు.