
న్యూఢిల్లీ : రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రద్దు చేయనుందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. సోమవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను త్వరలో చలామణిలోంచి తీసేయనున్నట్లు కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని పేర్కొంది. అంతకు క్రితం కేంద్రం కూడా ఈ నోట్ల రద్దుపై స్పందించింది. పాత నోట్ల రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసింది. ( ఎన్‌బీఎఫ్‌సీలు : ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు )
నిన్న (ఆదివారం) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) దీనిపై ట్విటర్ పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. అదో ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. కాగా, 2021 మార్చి లేదా ఏప్రిల్ చివరి నాటికి రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోనుందని మీడియాలో వెలువడ్డ వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.
— ReserveBankOfIndia (@RBI) January 25, 2021
Comments
Please login to add a commentAdd a comment