ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశంలో వినియోగం పెరుగుదలకు, తద్వారా వృద్ధి స్పీడ్ ఊపందుకోడానికి దోహదపడుతుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎకనమిస్టులు తమ తాజా నోట్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆరి్థక సంవత్సరం (2023–24)లో వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందన్న ఆర్‌బీఐ అంచనాలకు మించి ఎకానమీ స్పీడ్ ఉంటుందని కూడా వీరి నోట్ అభిప్రాయపడింది.
క్యూ1లో 8.1 శాతం వృద్ధి
ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని ఆర్‌బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష అంచనావేయగా, 8.1 శాతంగా ఈ రేటు నమోదవుతుందని ఎస్‌బీఐ ఎకనమిస్టులు అంచనా వేశారు. రూ.2000 నోట్ల రద్దు వల్ల వినియోగ వ్యయం రూ.55,000 కోట్లు పెరుగుతుందన్నది ఎకనమిస్టుల అంచనా. నోట్ ప్రకారం బంగారం, ఆభరణాలు, ఎయిర్ కండీషనర్లు, మొబైల్ ఫోన్‌లు, రియల్ ఎస్టేట్ వంటి హై–ఎండ్ కన్సూ్యమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాల్లో వినియోగ వ్యయాలు పెరుగుతాయి. రూ.2,000 వ్యయాల్లో 30 శాతం ఇందనం కొనుగోళ్లు, ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్‌లకు క్యాష్ ఆన్ డెలివరీలకు వెచ్చిస్తున్నట్లు కూడా నోట్ లెక్కగట్టింది. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు కూడా విరాళాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే క్లోజ్ యూజర్ గ్రూప్‌లో పరీక్షిస్తున్న ఆర్‌బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కూడా రూ. 2,000 నోట్లను ఉపసంహరణ వల్ల ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది.
ఈ–రూపీ వినియోగం స్పీడ్
అధిక డినామినేషన్ నోటు లేకపోవడం వలన చిన్న స్థాయి లావాదేవీలకు తక్కువ విలువకలిగిన ఫిజికల్ కరెన్సీ నోట్లు, వ్యాపార లావాదేవీల కోసం ఈ–రూపీ వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచి్చన ఆర్‌బీఐ, గత నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్‌బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. కాగా, వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయని, వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించారు. వ్యవస్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి.
Rs 2,000 Withdrawals: వినియోగానికి రూ.2,000 నోట్ ఉపసంహరణ బూస్ట్
Published Tue, Jun 20 2023 4:37 AM | Last Updated on Tue, Jun 20 2023 8:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment