నోట్ల రద్దుపై సీఎం చంద్రబాబు ట్వీట్లు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణి మరోమారు బయటపడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో ఉన్నప్పుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడిన చంద్రబాబు.. సోమవారం నోట్ల రద్దు వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అందుకు మోదీనే కారణమని ఆరోపించారు.
2016 నవంబర్ 8న నోట్ల రద్దును ఉద్దేశించి ‘రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ నిర్ణయం వల్ల దేశంలో అవినీతి తగ్గతుంది’ అంటూ ట్విటర్‌లో చంద్రబాబు రాసుకొచ్చారు.
విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులో పాల్గొన్న ఆయన ‘ప్రధాని నరేంద్ర మోదీ చర్యలతో ప్రభుత్వ పాలన గాడి తప్పింది. బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ, పనులు తక్కువ. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే. వారి పథకాలతో బాగుపడ్డ వాళ్లు ఎవరూ లేరు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్వవస్థను నిర్వీర్యం చేశారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడింది’ అంటూ ఎన్డీయే ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అందితే జుట్టు అంతక పోతే కాళ్లు అన్న సామెత చందంగా... చంద్రబాబు తీరు మళ్లీ బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment