నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేస్తున్న ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమం ఆగదని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. ఆదివారం కడప నగరపాలక సంస్థ ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ ఎస్టీ విభాగం అధ్యక్షులు వేణుగోపాల్ నాయక్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ దీక్షలను మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా ప్రారంభించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. 15 రోజుల పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తే కేంద్రం వాటిపై చర్చ జరక్కుండా అడ్డుకోవడం అత్యంత దారుణమన్నారు.
ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగినా ప్రధాని మోడీ స్పందించకపోవడం అన్యాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఈనెల 16వ తేదీ జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, తుమ్మలకుంట శివశంకర్, అఫ్జల్‌ఖాన్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. యానాదయ్య, నగర అధ్యక్షుడు పులి సునీల్, నాయకులు డి. శివప్రసాద్, కె. బాబు, లక్ష్మయ్య, షఫీ, పస్తం అంజి, కృష్ణ, నాగేంద్రారెడ్డి, చినబాబు, బాలస్వామిరెడ్డి, నాగమల్లారెడ్డి తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment