
న్యూఢిల్లీ: పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ వెల్లడించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పడే ప్రగతి చక్రాలు ఆశించినంత వేగంగా పరుగు తీయకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలియజేశారు. ఇండియా ఎకనమిక్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం సుబ్రమణియన్ ఈ విషయాలు చెప్పారు. ‘ఉత్పాదకత మెరుగుపడితే వేతనాలు పెరుగుతాయి.
ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి. ఇవన్నీ కలిస్తే అంతిమంగా వినియోగదారుల కొనుగోలు శక్తి మెరుగుపడి, డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ ఆధారంగానే కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ఇదో చక్రం లాంటిది. గతంలో 7% పైగా వృద్ధి రేటు ఉన్నప్పుడు.. ఈ చక్రాలు వేగంగా పరుగెత్తేవి.. కానీ గడిచిన కొన్ని త్రైమాసికాలుగా ఆశించినంత స్థాయిలో పరుగు తియ్యడం లేదు. అందుకే .. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది‘ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment